Page Loader
Kanuguva: 'కంగువ' కోసం ప్రభాస్.. తెలుగు వర్షన్‌ కోసం వాయిస్ ఓవర్‌ 
'కంగువ' కోసం ప్రభాస్.. తెలుగు వర్షన్‌ కోసం వాయిస్ ఓవర్‌

Kanuguva: 'కంగువ' కోసం ప్రభాస్.. తెలుగు వర్షన్‌ కోసం వాయిస్ ఓవర్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 08, 2024
10:09 am

ఈ వార్తాకథనం ఏంటి

తమిళ ప్రేక్షకులతో పాటు పాన్ ఇండియా సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసున్న సూర్య 'కంగువ' చిత్రం నవంబర్ 14న విడుదలకు సిద్ధమవుతోంది. మొదట దసరా కానుకగా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించిన మేకర్స్, రజనీకాంత్'వేట్టయన్' సినిమా కారణంగా చివరి నిమిషంలో విడుదలను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. ఆలస్యమవకుండా వచ్చే నెలలో 30కి పైగా భాషల్లో ఈ సినిమాను విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ పీరియాడిక్ మూవీ ప్రమోషన్స్ ఇప్పుడు మెల్లగా ప్రారంభమవుతున్నాయి. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ కలిసి నిర్మిస్తున్నాయి.

వివరాలు 

 ప్రభాస్ కంగువా సినిమాకి వాయిస్ ఓవర్‌ 

యూవీ క్రియేషన్స్ బ్యానర్ ప్రభాస్‌కి హోం బ్యానర్ అని తెలిసిందే. ప్రభాస్‌కి ఈ బ్యానర్‌లో వచ్చే ప్రతి సినిమాకు మద్దతు ఉంటుందని సాక్ష్యాలు ఉన్నాయి. కంగువా సినిమా కోసం ప్రభాస్‌ ఏం చేస్తాడనే విషయం ఆసక్తికరంగా మారింది. చెన్నై లేదా హైదరాబాద్‌లో జరగబోతున్న పెద్ద ఈవెంట్‌కి ప్రభాస్‌ హాజరు అవుతారని ప్రచారం జరిగింది. కానీ తాజా వార్తల ప్రకారం, ప్రభాస్ కంగువా సినిమాకి వాయిస్ ఓవర్‌ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. తెలుగు వర్షన్‌ కోసం ప్రభాస్‌తో ప్రత్యేకంగా వాయిస్‌ ఓవర్‌ ఇచ్చేందుకు చర్చలు జరుగుతున్నాయని సమాచారం.

వివరాలు 

కంగువ 'బాహుబలి' స్థాయిలో సినిమాగా అంచనా 

ప్రభాస్‌ వాయిస్‌ ఓవర్‌ అందిస్తే, కంగువా సినిమా తెలుగు మార్కెట్‌లో అనూహ్యంగా బిజినెస్‌ పెరగాలన్న అవకాశం ఉంది. తమిళ సినీ ప్రేక్షకులు ఈ సినిమాను 'బాహుబలి' స్థాయిలో సినిమాగా అంచనా వేస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి ప్రభాస్‌ వాయిస్‌ ఓవర్‌ మరింత బలాన్ని చేకూరుస్తుంది. ప్రభాస్‌ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, తన హోం బ్యానర్‌ కోసం కంగువా సినిమా కోసం సమయం కేటాయించే అవకాశాలు ఉన్నాయని వినిపిస్తోంది. ఈ విషయంపై యూవీ క్రియేషన్స్ లేదా చిత్ర యూనిట్‌ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. ఈ వార్తలు ఎంత వరకు నిజమో తెలుసుకోవాలంటే యూవీ క్రియేషన్స్‌ స్పందించాలి.

వివరాలు 

 రూ.350కోట్ల బడ్జెట్‌తో కంగువ 

శివ ఈ చిత్రంలో సూర్యను గతంలో ఎప్పుడూ లేని విధంగా విభిన్నమైన పాత్రలో చూపించనున్నాడు. బాలీవుడ్‌ స్టార్‌ దిశా పటానీ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నారు.మరో ప్రముఖ నటుడు బాబీ డియోల్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ భారీ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.దాదాపు రూ.350కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ బిజినెస్‌లో అంచనాలకు మించి వసూలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇటీవలి కాలంలో టాలీవుడ్‌లో డబ్బింగ్‌ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించక పోవడంతో,ప్రభాస్‌ వాయిస్‌ ఓవర్‌ తో కంగువా సినిమా పాజిటివ్ టాక్‌ను సృష్టిస్తే,భారీ వసూళ్లు నమోదు చేసే అవకాశాలు అధికంగా ఉన్నాయి. కంగువా కోసం ప్రభాస్‌ ఏం చేస్తాడో చూడాలి.