Page Loader
రామ్ చరణ్ తో కలిసి పనిచేస్తానంటున్న ప్రభాస్: అభిమానులకు పూనకాలే 
రామ్ చరణ్ తో నటిస్తానంటున్న ప్రభాస్

రామ్ చరణ్ తో కలిసి పనిచేస్తానంటున్న ప్రభాస్: అభిమానులకు పూనకాలే 

వ్రాసిన వారు Sriram Pranateja
Jul 21, 2023
02:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

కల్కి 2898 AD గ్లింప్స్ రిలీజైన దగ్గర నుండి సోషల్ మీడియాలో కల్కి గురించిన వార్తలే వస్తున్నాయి. హాలీవుడ్ లెవెల్ విజువల్స్ తో కల్కి 2898 AD గ్లింప్స్ అందరినీ ఆకర్షిస్తోంది. గ్లింప్స్ విడుదల తర్వాత మీడియాతో ముచ్చటించిన ప్రభాస్, రాజమౌళి గురించి మాట్లాడుతూ, ఇండియాలో ఉన్న గొప్ప దర్శకుల్లో రాజమౌళి ఒకరని, ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ రావడం తనకు ఆనందాన్నిచ్చిందని చెప్పుకొచ్చారు. అలాగే రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ, చరణ్ తనకు మంచి ఫ్రెండ్ అని, భవిష్యత్తులో చరణ్ తో కలిసి పనిచేస్తానని ప్రభాస్ అన్నారు. ఈ మాటలు ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. ప్రభాస్, రామ్ చరణ్ కలిసి పనిచేస్తే బాక్సాఫీసు బద్దలైపోతుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రామ్ చరణ్ తో వర్క్ చేస్తానంటున్న ప్రభాస్