Page Loader
Prabhas: కటౌట్‌లో అల్ టైం రికార్డు క్రియేట్ చేసిన ప్రభాస్.. దేశంలోనే అతిపెద్దదిగా!
కటౌట్‌లో అల్ టైం రికార్డు క్రియేట్ చేసిన ప్రభాస్.. దేశంలోనే అతిపెద్దదిగా!

Prabhas: కటౌట్‌లో అల్ టైం రికార్డు క్రియేట్ చేసిన ప్రభాస్.. దేశంలోనే అతిపెద్దదిగా!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 23, 2023
03:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు వేడుకలు హైదరాబాద్‌లో వేరే లెవల్‌లో జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రభాస్ భారీ కటౌట్లను ఏర్పాటు చేసి పాలాభిషేకాలతో డార్లింగ్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా ఇప్పటివరకూ ఏ హీరోకు జరగని విధంగా ప్రభాస్ బర్త్ డే పార్టీ జరుగుతోంది. కూకట్ పల్లిలోని కతైలాపూర్ గ్రౌండ్‌లో భారీగా డార్లింగ్ కటౌట్ ను నిర్మించారు. 'సలార్' సినిమాలోని రెండు కత్తుల పట్టుకొని ప్రత్యర్థులను అంతం చేసే ఫోటోని కటౌట్ గా నిర్మించారు. దీన్ని 230 అడుగుతో నిర్మించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటివరకూ మరే హీరో కటౌట్‌లు కూడా ఇన్ని అడుగులతో నిర్మించలేదు.

Details

యూకేలో ప్రభాస్

ఈ కటౌట్‌ను ఆవిష్కరించేందుకు ఆయన అభిమానులు హైదరాబాద్‌లో భారీగా ర్యాలీ నిర్వహించారు. ఇక ప్రభాస్ ఫోటో ముద్రించిన టీ షర్ట్‌లు ధరించి నినాదాలతో హోరెత్తించారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ యూకేలో ఉన్నట్లు తెలిసింది. కొన్ని రోజుల క్రితమే ఆయన యూకేకి వెళ్లారట. అక్కడ సెలబ్రేషన్స్ పూర్తి అయ్యాక తిరిగి ఆయన ఇండియాకు రానున్నారు. ప్రభాస్ సినిమాల విషయానికొస్తే ప్రభాస్ నటించిన సలార్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఆయన కల్కి సినిమాలో నటిస్తున్నారు.