ప్రభుదేవా బర్త్ డే స్పెషల్: ఇండియన్ మైఖేల్ జాక్సన్ కెరీర్లో గుర్తుండిపోయే డాన్స్ మూవ్స్
వెండితెర మీద డాన్స్ కి ప్రత్యేకత తీసుకొచ్చింది ప్రభుదేవా అని చెప్పుకోవచ్చు. అప్పటి వరకూ వెండితెర పై కనిపించిన డాన్స్ ఒకలాగా ఉంటే, ప్రభుదేవా వచ్చిన తర్వాత డాన్స్ మరో లెవెల్ కి వెళ్ళింది. డాన్సర్ గా, కొరియోగ్రాఫర్ గా, నటుడిగా, దర్శకుడిగా కెరీర్లో భిన్నా పార్శ్వాల్లో కనిపించిన ప్రభుదేవా, ఈరోజు తన 50వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ప్రభుదేవా కొరొయోగ్రఫీ లోంచి వచ్చిన పాటలను, గుర్తింపు తెచ్చిన డాన్స్ మూవ్స్ ని ఒకసారి గుర్తు చేసుకుందాం. ఊర్వశి ఊర్వశి: ప్రేమికుడు చిత్రంలోని ఈ పాటలో ప్రభుదేవా డాన్స్ మూవ్స్ ప్రత్యేకంగా ఉంటాయి. అప్పటి నుండి ఇప్పటిదాకా ఇందులోని డాన్స్ చూసి ఫిదా కాని వాళ్ళెవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు.
ప్రభుదేవా కొరియోగ్రఫీ అందించిన పాటల్లో గుర్తుండిపోయేవి
ముక్కాలా ముకాబులా: ఇది కూడా ప్రేమికుడు సినిమాలోనిదే. మైఖేల్ జాక్సన్ తరహా స్టెప్పులు ఇందులో కనిపిస్తాయి. మ్యూజిక్ కి తగినట్టు వేసే స్టెప్పులు చూపరులను ఆకట్టుకుంటాయి. శంకర్ దర్శకత్వం కాబట్టి చివర్లో కనిపించిన గ్రాఫిక్స్ ఈ పాటను గుర్తుండిపోయేలా చేసింది. మై ఐసా క్యూహూ: హృతిక్ రోషన్ నటించిన లక్ష్య మూవీలోని పాట ఇది. ఈ పాటకు చేసిన కొరియోగ్రఫీకి జాతీయ అవార్డు అందుకున్నారు ప్రభుదేవా. హృతిక్ వేసిన స్టెప్పులు మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. సారీ కే ఫాల్ సా: ఆర్ రాజ్ కుమార్ చిత్రంలోని ఈ పాట అప్పట్లో బాగా ఫేమస్ అయ్యింది. ఇందులో సోనాక్షి సిన్హా, షాహిద్ కపూర్ వేసిన స్టెప్పులు బాగా ఫేమస్ అయ్యాయి.