Return Of The Dragon:రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే ?
ఈ వార్తాకథనం ఏంటి
'లవ్ టుడే' సినిమాతో తమిళంతో పాటు తెలుగులోను మంచి గుర్తింపు పొందిన ప్రదీప్ రంగనాథన్. ఆయన హీరోగా నటించిన చిత్రం 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్'.
అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించింది.
ఈ చిత్రాన్ని అర్చనా కల్పతి నిర్మించారు.ఫిబ్రవరి 21న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను సంపాదించుకొని బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది.
ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.
మార్చి 21 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందని నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం అందుబాటులో ఉండనుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్
#ReturnOfTheDragon: streaming from 21st march only on #Netflix #DragonOnNetflix pic.twitter.com/6fbRtO0gTs
— iDream Media (@iDreamMedia) March 18, 2025