LOADING...
Pragathi: అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో సత్తాచాటిన టాలీవుడ్ నటి 
అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో సత్తాచాటిన టాలీవుడ్ నటి

Pragathi: అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో సత్తాచాటిన టాలీవుడ్ నటి 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 10, 2025
04:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ నటి ప్రగతి ఇటీవల టర్కీలో జరిగిన ఏషియన్ ఓపెన్ మాస్టర్స్ పవర్‌లిఫ్టింగ్ పోటీల్లోబంగారు పతకం సహా 4 మెడల్స్ గెలుచుకుని సత్తా చాటారు. ఈ విజయంతో ఆమెపై దేశవ్యాప్తంగా స్ఫూర్తిదాయక అభినందనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా, ప్రగతి విజయంపై జనసేన పార్టీ వీరమహిళ విభాగం ప్రత్యేకంగా స్పందించింది. వీరమహిళ విభాగం ప్రకటనలో ప్రగతి వంటి బహుముఖ సామర్థ్యాలు కలిగిన మహిళలు అందరికీ ఆదర్శంగా నిలుస్తారని, స్ఫూర్తిదాయకమని తెలిపింది. కళలలోనూ, అంతర్జాతీయ క్రీడల్లోనూ ప్రతిభ చూపిస్తూ రాణిస్తున్న మహిళలనే సమాజం గౌరవించాల్సిన అవసరాన్ని ఉద్దేశించింది.

వివరాలు 

ప్రగతిపై అభినందనల వర్షం 

"ప్రగతి లాంటి మహిళలు శక్తి, పట్టుదల, స్ఫూర్తికి ప్రత్యక్ష ఉదాహరణలు. వారు ఎదురైన కష్టాలను అధిగమిస్తూ, గొప్ప విజయాలు సాధించడం ద్వారా అనేకరికి మార్గదర్శకంగా నిలుస్తున్నారు" అని ఆ ప్రకటనలో పేర్కొంది. ఆమె అంకితభావం, ధైర్యం అనేక మంది ఇతరులను కూడా తమ కలలను సాకారం చేసుకోవడానికి ప్రేరేపిస్తాయని పేర్కొంది. అభిరుచి, పట్టుదల ఉంటే ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చని ప్రగతి నిరూపించిందని, అలాగే ప్రగతి వంటి మహిళలను గౌరవించడం కేవలం వ్యక్తిగత విజయాలను మాత్రమే గుర్తించడం కాదు, సమాజంలోని ప్రతి రంగంలో మహిళల శక్తి, సామర్థ్యం, నాయకత్వాన్ని గుర్తించడమేనని స్పష్టం చేసింది.

Advertisement