
Prakash Raj: గెలిచేముందు ఒక అవతారం... గెలిచిన తర్వాత ఇంకో అవతారం..పవన్ కల్యాణ్‌పై ప్రకాశ్‌రాజ్ ఫైర్
ఈ వార్తాకథనం ఏంటి
తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో సినీ నటుడు ప్రకాశ్ రాజ్,ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మధ్య డైలాగ్ వార్ హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే.
"ఇది మీరు ఉన్న రాష్ట్రంలో జరిగిన విషయం. దీనిపై విచారణ జరిపి నేరస్తులపై చర్యలు తీసుకోవండి," అంటూ ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేయగా, ఈ వ్యవహారంలో ప్రకాశ్ రాజ్‌కు సంబంధం ఏమిటని పవన్ ప్రశ్నించారు.
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు స్పందిస్తూ ప్రకాశ్ రాజ్, "తాను విదేశాల్లో షూటింగ్‌లో ఉన్నా. పవన్ కల్యాణ్ తన ట్వీట్ మళ్లీ చదివి, దయచేసి అర్థం చేసుకోవాలి," అని అభ్యర్థించారు.
అదే విధంగా,"ఈ నెల 30న తిరిగి వచ్చి మీ ప్రతి మాటకు సమాధానం ఇస్తాను" అని ఆయన తెలిపారు.
వివరాలు
పవన్ కల్యాణ ఎలా స్పందిస్తారో..
ఆ తరువాత ప్రకాశ్ రాజ్ మరో ట్వీట్‌లో, "చేయని తప్పుకు సారీ చెప్పించుకోవడంలో ఏం ఆనందం ఉంటుంది?" అని ప్రశ్నిస్తూ, 'జస్ట్ ఆస్కింగ్' అనే హ్యాష్‌ట్యాగ్‌ను జోడించారు.
ఇటీవల ప్రకాశ్ రాజ్ మరో ట్వీట్ చేస్తూ హాట్ టాపిక్‌గా నిలిచారు. "గెలిచే ముందు ఒక అవతారం, గెలిచిన తర్వాత మరో అవతారం. ఈ అవాంతరం ఏమిటి? మనకు ఎందుకీ అయోమయం? ఏది నిజం?" అంటూ ప్రశ్నించారు.
ఈ ట్వీట్ పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పుడు పవన్ కల్యాణ్ దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ప్రకాష్ రాజ్ చేసిన తాజా ట్వీట్
గెలిచేముందు ఒక అవతారం... గెలిచిన తర్వాత ఇంకో అవతారం..
— Prakash Raj (@prakashraaj) September 26, 2024
ఏంటీ అవాంతరం.. ఏందుకు మనకీ అయోమయం… ఏది నిజం?
జస్ట్ ఆస్కింగ్? #justasking