Page Loader
Prasanna Vadanam Release: ఆసక్తికరంగా 'ప్రసన్న వదనం' ట్రైలర్
Prasanna Vadanam Release: ఆసక్తికరంగా 'ప్రసన్న వదనం' ట్రైలర్

Prasanna Vadanam Release: ఆసక్తికరంగా 'ప్రసన్న వదనం' ట్రైలర్

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 30, 2024
01:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

కలర్ ఫోటో' సినిమాతో హీరోగా మారిన సుహాస్ (Suhas) అటు తరువాత 'రైటర్ పద్మభూషణ్', 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' వంటి సినిమాలతో సూపర్ హిట్లు కొట్టాడు. అతని ఫామ్ చూసి ఎంతో మంది దర్శక నిర్మాతలు కథలు రెడీ చేసుకుంటున్నారు. తాజాగా, సుహాస్ హీరోగా 'ప్రసన్న వదనం' (Prasanna Vadanam) అనే థ్రిల్లర్ మూవీ రూపొందింది. ఈ సినిమాకి సుకుమార్ శిష్యుడు అర్జున్ వై కె దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని జె ఎస్ మణికంఠ, టి ఆర్ ప్రసాద్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమాలో పాయల్ రాధాకృష్ణ , రాశి సింగ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

Details

ఫేస్ బ్లైండ్‌నెస్ వ్యాధితో సుహాస్ 

ఇక,ఈ మూవీ మే 3న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. విడుద‌ల దగ్గ‌ర ప‌డుతుండ‌టంతో ప్ర‌మోష‌న్స్ వేగం పెంచారు మేక‌ర్స్. ఇప్ప‌టికే ఈ మూవీ నుంచి టీజ‌ర్ విడుద‌ల చేయ‌గా ప్రేక్ష‌కులను ఆక‌ట్టుకుంది. ఇదిలావుంటే తాజాగా మూవీ నుంచి ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఈ ట్రైల‌ర్ లో ఫేస్ బ్లైండ్‌నెస్ అనే వ్యాధితో సుహాస్ బాధపడుతుండడం మనం చూడచ్చు. ఈ వ్యాధి వ‌చ్చిన వాళ్ళు ఒక వ్యక్తికి సంబంధించి మొహం తప్ప అన్ని గుర్తుప‌డ‌తారు. అయితే ఈ వ్యాధి ఉన్న సుహాస్‌కు అనుకోకుండా ఒక స‌మ‌స్య ఎదుర‌వుతుంది. ఇక ఆ సమస్య నుంచి సుహాస్ ఎలా బయటపడ్డాడు అనేది సినిమా స్టోరీ. ఇంట్రెస్టింగ్‌గా సాగిన ఈ ట్రైల‌ర్‌ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.