LOADING...
Ram Charan: విడుదలకు సిద్ధమైన రామ్ చరణ్ 'పెద్ది'..'వికసిత్ భారత్' చిత్రమిదే అన్న ప్రధాని మోదీ
విడుదలకు సిద్ధమైన రామ్ చరణ్ 'పెద్ది'..'వికసిత్ భారత్' చిత్రమిదే అన్న ప్రధాని మోదీ

Ram Charan: విడుదలకు సిద్ధమైన రామ్ చరణ్ 'పెద్ది'..'వికసిత్ భారత్' చిత్రమిదే అన్న ప్రధాని మోదీ

వ్రాసిన వారు Moogati Shabari
May 28, 2026
05:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న భారీ చిత్రం 'పెద్ది' త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు బుచ్చిబాబు సనా రూపొందిస్తున్న ఈ సినిమాను జూన్ నాలుగున ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ కథానాయికగా నటించగా, సంగీతాన్ని ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ.ఆర్.రెహ్మాన్ అందించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

వివరాలు

ఢిల్లీలో భారీ స్పందన..

ప్రస్తుతం చిత్రబృందం దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉంది. వరుస ఇంటర్వ్యూలు, మీడియా సమావేశాలు నిర్వహిస్తూ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో ప్రత్యేక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రామ్ చరణ్ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ సినిమాపై చర్చ జరుగుతోందని, ఢిల్లీలో కూడా మంచి స్పందన కనిపిస్తోందని తెలిపారు.

వివరాలు

నిజమైన 'వికసిత్ భారత్'..

ఈ సందర్భంగా రామ్ చరణ్ ఒక ప్రత్యేక సంఘటనను గుర్తు చేసుకున్నారు. తాను గతంలో ఢిల్లీకి వెళ్లినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. తన కొత్త చిత్రం 'పెద్ది' గురించి అడిగారని చెప్పారు. అప్పుడు ఈ సినిమా భారతీయ సంప్రదాయాలు, సంస్కృతి, దేశపు మూలాలను ప్రతిబింబించే కథతో రూపొందిందని, ఇది నిజమైన 'వికసిత్ భారత్' భావనను చూపించే చిత్రం అని ఆయనకు వివరించినట్లు తెలిపారు. ప్రస్తుతం చరణ్ చేసిన ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. భారీ అంచనాల నడుమ విడుదల కానున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Advertisement