LOADING...
SSMB29: రాజమౌళి - మహేశ్‌ సినిమాలో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌?
రాజమౌళి - మహేశ్‌ సినిమాలో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌?

SSMB29: రాజమౌళి - మహేశ్‌ సినిమాలో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌?

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 04, 2025
11:13 am

ఈ వార్తాకథనం ఏంటి

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు కథానాయకుడిగా, దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో రూపొందనున్న భారీ ప్రాజెక్ట్‌పై దేశవ్యాప్తంగా ఉన్న సినీప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన చిన్న అప్డేట్‌ వచ్చినా క్షణాల్లో వైరల్‌ అవుతోంది. తాజాగా మలయాళ స్టార్‌ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ చేసిన ఓ పోస్ట్‌ వైరల్ అవుతోంది ఇప్పటి వరకు పృథ్వీరాజ్‌ ఈ చిత్రంలో నటించనున్నారని వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ వాటిపై ఆయన స్పష్టమైన ప్రకటన చేయలేదు. తాజాగా ఆయన తన ఇన్‌స్టాలో "దర్శకుడిగా నా సినిమాలన్నీ పూర్తి చేశాను. మార్కెటింగ్‌ పనులు ముగిసాయి. ఇకపై నటుడిగా తెరపై కనిపించేందుకు సిద్ధమవుతున్నా. అందులో పెద్ద డైలాగులు ఉన్నాయని తెలిసి కాస్త భయపడుతున్నా అని రాసుకొచ్చారు.

Details

ఇంకా ఫైనల్ కాదు

ఇప్పటికే గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయనకు SSMB 29లో నటించనున్నారా? అనే ప్రశ్నకు "నాకంటే మీకే ఎక్కువ విషయాలు తెలిశాయి. ఇంకా ఏదీ ఫైనల్‌ కాలేదు. చర్చలు జరుగుతున్నాయి. అవి పూర్తయిన తర్వాత మాట్లాడుదామని తసమాధానమిచ్చారు. SSMB 29 కథ విషయానికి వస్తే, ప్రపంచాన్ని చుట్టేసే ఓ సాహస ప్రయాణంగా, అటవీ నేపథ్యంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్‌ నటుడు రణవీర్‌ సింగ్‌ కీలక పాత్ర పోషించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ప్రియాంకా చోప్రా కూడా ఈ సినిమాతో టాలీవుడ్‌లో అడుగు పెట్టనున్నట్లు టాక్‌ ఉంది.

Details

త్వరలో ప్రకటన వచ్చే అవకాశం

మహేశ్‌బాబు ఈ సినిమా కోసం తన లుక్‌ను పూర్తిగా మార్చుకుంటున్నారు. ఇప్పటికే ఆయన జిమ్‌లో వర్కౌట్‌ చేస్తున్న వీడియోలు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోయినా, పృథ్వీరాజ్‌ తాజా పోస్ట్‌ వెనుక ఉన్న అర్థాన్ని విశ్లేషిస్తూ అభిమానులు, నెటిజన్లు SSMB 29లో ఆయన పాత్ర ఖరారైనట్లు అభిప్రాయపడుతున్నారు. మరి దీనిపై చిత్రబృందం ఎప్పటికైనా క్లారిటీ ఇస్తుందేమో చూడాలి!