Page Loader
Vijay Deverakonda: రెండు భాగాలుగా VD12.. అప్‌డేట్‌ ఇచ్చిన నిర్మాత
రెండు భాగాలుగా VD12.. అప్‌డేట్‌ ఇచ్చిన నిర్మాత

Vijay Deverakonda: రెండు భాగాలుగా VD12.. అప్‌డేట్‌ ఇచ్చిన నిర్మాత

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 05, 2024
11:06 am

ఈ వార్తాకథనం ఏంటి

విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబోలో వస్తున్న చిత్రం VD12 పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రంను ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌ కలిసి సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నిర్మాత నాగవంశీ మరోసారి ఓపెన్ అయ్యాడు. నాగ వంశీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఫస్ట్ పార్ట్ క్లిక్ అయితేనే సెకండ్ పార్ట్ రిలీజ్ అవుతుందని చెప్పాడు.

వివరాలు 

కీలక పాత్రలో మరో హీరో

"ఈ సినిమాతో రిస్క్ చేయడం నాకు ఇష్టం లేదు. రెండు భాగాలకు సరిపోయే మంచి కంటెంట్ ఉంది. అయితే రెస్పాన్స్‌ని బట్టి రెండో భాగం విడుదల కానుంది. గౌతమ్ ఈ చిత్రానికి కథ అందించారు, సినిమా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది'' అని నాగ వంశీ అన్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ అభిమానుల్లో అంచనాలు పెంచింది. 2025 మార్చి 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే 60 శాతం షూటింగ్‌ పూర్తయింది. ఈ సినిమాకు అనిరుధ్‌ సంగీతం అందిస్తున్నారు. ఇందులో హీరో సత్యదేవ్‌ కీలక పాత్రలో కనిపించనున్నారని సమాచారం.