
Vijay Dewara Konda : విజయ్ దేవర కొండ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'VD12' రిలీజ్ డేట్ ఫిక్స్
ఈ వార్తాకథనం ఏంటి
విజయ దేవరకొండ అద్బుతమైన నటనా నైపుణ్యంతో స్టార్‌గా ఎదగడమే కాకుండా, దేశ వ్యాప్తంగా అన్ని భాషల ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా 'VD12' అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ మూవీ తెరకెక్కుతోంది.
ఈ చిత్రానికి 'మళ్ళీ రావా', 'జెర్సీ' చిత్రాలతో ఆకట్టుకున్న గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ మధ్యనే ఈ మూవీని శ్రీలంకలో షూటింగ్ చేశారు.
తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ కీలక అప్డేట్ బయటికి వచ్చింది.
Details
వచ్చే ఏడాది మార్చి 28న రిలీజ్
ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 28న విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు.
అలాగే సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను ఆగస్టులో ఆవిష్కరించనున్నట్లు తెలిపారు.
ఇప్పటిదాకా 60శాతం చిత్రీకరణ పూర్తియైంది.
విజయ్ దేవరకొండ సరసన శ్రీ లీలా హీరోయిన్ నటిస్తుండగా రాక్‌స్టార్ అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నాడు.