NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Kanguva Sequel: కంగువ సీక్వెల్ పై కీలక అప్డేట్ చెప్పిన ప్రొడ్యూసర్
    తదుపరి వార్తా కథనం
    Kanguva Sequel: కంగువ సీక్వెల్ పై కీలక అప్డేట్ చెప్పిన ప్రొడ్యూసర్
    కంగువ సీక్వెల్ పై కీలక అప్డేట్ చెప్పిన ప్రొడ్యూసర్

    Kanguva Sequel: కంగువ సీక్వెల్ పై కీలక అప్డేట్ చెప్పిన ప్రొడ్యూసర్

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 14, 2024
    12:07 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఈ ఏడాది మోస్ట్ అవేటెడ్ సినిమాల్లో "కంగువ" ఒకటి. పలుసార్లు వాయిదా పడిన తర్వాత, నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా 11,000 స్క్రీన్లపై విడుదలైంది.

    ఈ చిత్రంలో సూర్య, బాబీ డియోల్, దిశా పటానీ నటించారు. తొలి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ అందుకుంటూ, సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించింది.

    కంగువ సీక్వెల్ గురించి

    కంగువ సీక్వెల్ ప్రణాళికపై సినిమా ప్రొడ్యూసర్ కేఈ జ్ఞానవేల్ రాజా తాజాగా మాట్లాడారు.

    ఆయన తెలిపిన వివరాల ప్రకారం, కంగువ సీక్వెల్ షూటింగ్ 2026లో మొదలై, 2027లో ప్రేక్షకుల ముందుకు రానున్నది.

    ఈ ఏడాది చివర్లో, 2025 ప్రారంభంలో ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రారంభమవుతాయి.

    వివరాలు 

    సీక్వెల్‌కు ప్రణాళిక 

    సీక్వెల్ పై డైరెక్టర్ శివ ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా చిత్రీకరించాలని భావిస్తున్నారని జ్ఞానవేల్ వెల్లడించారు.

    ఒక వెబ్ సిరీస్ మాదిరిగా, ప్రతి పాత్రకు ప్రత్యేకమైన ఫ్లాష్ బ్యాక్ కథనాలు చూపించాలని వారి ప్రణాళిక.

    ఈ సినిమా ద్వారా మన పూర్వీకుల జీవితం, వారి కఠిన జీవనశైలి, ఆ కాలపు అనేక జ్ఞాపకాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని శివ సంకల్పించారు.

    కంగువ సినిమా విజయం

    "కంగువ" చిత్రం గురువారం (నవంబర్ 14) ఉదయం 4గంటలకు విడుదల కావడంతో, అనేక ప్రాంతాల్లో షోలు ప్రారంభమయ్యాయి.

    మొదటి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ అందుతోంది. ముఖ్యంగా సూర్య నటనకు మంచి ప్రశంసలు లభించాయి, కొందరు ప్రేక్షకులు ఆయన ప్రదర్శనను ఆస్కార్ స్థాయిలోగా కొనియాడారు.

    వివరాలు 

    కంగువ ఓటీటీ రిలీజ్ 

    సినిమా విడుదల అనంతరం, "కంగువ" ఓటీటీ వేదికపై డిజిటల్ ప్రీమియర్ అవుతుందని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

    ఈ మూవీ ఆరు వారాల తరువాత ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రానుంది. డిసెంబర్ చివరి వారంలో ఈ సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది.

    ప్రైమ్ వీడియో డిజిటల్ హక్కులు

    కంగువ సినిమాకు డిజిటల్ హక్కులను ప్రైమ్ వీడియో రూ. 100 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం.

    ఈ సినిమా తెలుగుతోపాటు మొత్తం 8 భాషల్లో విడుదలైంది. అన్ని భాషల వెర్షన్లు ప్రైమ్ వీడియోలోనే ప్రసారం కానున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కంగువ

    తాజా

    India-US: భారత్‌,అమెరికా మొదటి దశ వాణిజ్య ఒప్పందంపై త్వరితగతిన అడుగులు  పీయూష్ గోయెల్‌
    Ajith: పని చేసుకుంటూ రేసింగ్‌లో పాల్గొన్నా.. చిన్ననాటి కష్టాలు గుర్తు చేసుకున్న అజిత్ అజిత్ కుమార్
    Jr.NTR Birthday: లంబోర్గినీ నుంచి పోర్షే వరకు తారక్ గ్యారేజ్'లో కార్లు ఇవే..  జూనియర్ ఎన్టీఆర్
    WAR 2: 'వార్ 2' టీజర్‌ వచ్చేసింది.. ఎన్టీఆర్ పవర్‌ లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా! జూనియర్ ఎన్టీఆర్

    కంగువ

    సూర్య కంగువ నుండి ఖతర్నాక్ అప్డేట్: గ్లింప్స్ వీడియో ఎప్పుడు రిలీజ్ కానుందంటే?  సూర్య
    సూర్య కంగువ రిలీజ్ డేట్ వచ్చేసింది: ఎప్పుడు విడుదల కానుందంటే?  సూర్య
    కంగువ గ్లింప్స్ రిలీజ్ టైమ్ అప్డేట్ : రాత్రి నిద్రపోకుండా చేస్తున్న సూర్య  సూర్య
    Surya Kanguva : సూర్య 'కంగువ' నుంచి లేటెస్ట్ అప్డేట్.. సినిమా ఎన్ని భాషల్లో తెలుసా కోలీవుడ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025