
Smriti Irani - Deepika Padukone: 'నిర్మాతలకు నష్టం కాకూడదు'.. దీపిక పని గంటల వివాదంపై స్మృతి ఇరానీ స్పందన
ఈ వార్తాకథనం ఏంటి
దాదాపు రెండు దశాబ్దాల తర్వాత, కేంద్ర మాజీమంత్రి స్మృతి ఇరానీ మరోసారి బుల్లితెర ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 'క్యోంకీ సాస్ భీ కభీ బహు థీ 2' ద్వారా ఆమె ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవల బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారిన పని గంటల అంశంపై స్మృతి ఇరానీ ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. బాలీవుడ్ నటి దీపికా పదుకొణె పని గంటల కారణంగా రెండు భారీ ప్రాజెక్ట్‌లను నుంచి వైదొలగారన్న వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో, స్మృతి ఇరానీ స్పందించారు. ఇది పూర్తిగా దీపికా వ్యక్తిగత సమస్య అని అమె వెల్లడించారు. తాను ఎప్పుడూ నిర్మాతలకు లాభాలు రావాలని అంకితభావంతో పనిచేస్తానని స్మృతి స్పష్టం చేశారు.
Details
వివాదాల్లో చిక్కుకొనే వ్యక్తిని కాదు
'పని గంటల గురించి ఇటీవల వినిపిస్తున్న వార్తలపై కొందరు వివాదాస్పద అంశంగా మార్చడానికి మాత్రమే మాట్లాడుతున్నారు. కానీ, నేను దీన్ని పెద్ద సమస్యగా మార్చి వివాదాల్లో చిక్కుకునే వ్యక్తి కాదు. సీరియల్‌లో నటిస్తున్న సమయంలోనే ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చాను, ఆ సమయంలో కూడా నిర్మాతల కోణంలో ఆలోచించా. వారికి న్యాయం చేయాలని కష్టపడి పని చేసాను. నిర్మాతలకు లాభాలు రావాలని కోరడం నా బాధ్యత అని ఆమె తెలిపారు. నటి కావడం, రాజకీయాల్లో పాల్గొనడం, తల్లిగా పిల్లలను సంరక్షించడం ఇవన్నీ తన వ్యక్తిగత ఎంపికలు. అందుకే ప్రతి అంశంపై సమగ్ర బాధ్యతతో వ్యవహరించాలి.
Details
జులై 29 నుంచి సీక్వెల్ ప్రారంభం
'నిర్మాతల అవసరాలను అర్థం చేసుకోకుండా షూట్‌కు రాలేను అనడం అంటే 120 మందికి జీతం ఇవ్వలేము, వారి కుటుంబాలకు అన్యాయం అవుతుంది. అందుకే నేను ఎప్పుడూ ఆ విధంగా ఉండను, భిన్నంగా ఆలోచిస్తుంటానని స్మృతి స్పష్టం చేశారు. 25 ఏళ్ళ క్రితం స్మృతి ఇరానీ నటించిన హిందీ సీరియల్ 'క్యోంకీ సాస్ భీ కభీ బహు థీ' 2000 జులై నుండి 2008 నవంబరు వరకు విజయవంతంగా ప్రసారమైంది. ఇందులో తులసి పాత్రలో నటించి, ప్రేక్షకుల ఆదరణతోపాటు పలు అవార్డులు అందుకున్నారు. దీని సీక్వెల్ 'క్యోంకీ సాస్ భీ కభీ బహు థీ 2' జులై 29 నుంచి ప్రసారం అవుతోంది.