ప్రాజెక్ట్ కె టైటిల్ రివీల్ అమెరికాలోనే: ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే?
ఈ వార్తాకథనం ఏంటి
ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రం థియేటర్లలో సందడి చేస్తుండగానే ఆయన నటిస్తున్న ఇతర చిత్రాలపై వరుసగా అప్డేట్లు వస్తున్నాయి.
ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సలార్ సినిమా టీజర్, జులై 7వ తేదీన విడుదల అవుతుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.
తాజాగా ప్రాజెక్ట్ కె సినిమా నుండి అప్డేట్ రాబోతుంది. ఇప్పటివరకు ప్రీ లుక్స్ తో సరిపెట్టిన ప్రాజెక్ట్ కె టీమ్, ఈసారి టైటిల్ రివీల్, మోషన్ పోస్టర్లను సిద్ధం చేస్తోంది.
ప్రాజెక్ట్ కె టైటిల్, మోషన్ పోస్టర్ల విడుదల కార్యక్రమం, జులై మూడవ వారంలో అమెరికాలో జరుగుతుందని ప్రభాస్ టీమ్ అధికారికంగా వెల్లడి చేసింది.
Details
మెంటార్ గా సింగీతం శ్రీనివాసరావు
మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై 500కోట్లకు పైగా బడ్జెట్ తో సి అశ్వనీదత్ తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమాలో, బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే, దిశా పటాని నటిస్తున్నారు. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో ఉండనున్న ఈ సినిమాను కనివినీ ఎరుగని రీతిలో తీర్చిదిద్దుతున్నారు.
హాలీవుడ్ సినిమాలను తలదన్నేలా ప్రాజెక్ట్ కె సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాను మెంటార్ గా బాలకృష్ణతో సైన్స్ ఫిక్షన్ సినిమాను తెరకెక్కించిన సింగీతం శ్రీనివాసరావు ఉన్నారు.
వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా, జనవరి 12వ తేదీన ప్రాజెక్ట్ కె సినిమాను రిలీజ్ చేస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ప్రాజెక్ట్ కె టైటిల్ రివీల్ పై అప్డేట్
Team ProjectK is working on title. The official title and motion poster will be released in the United States.
— Team Praboss (@Team_PraBoss) June 22, 2023
The event will take place in the third week of July.#Prabhas