
పూరీ తమ్ముడి మాస్ రీఎంట్రీ.. దసరాకి దరువేస్తానంటున్న సాయిరామ్ శంకర్
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తమ్ముడు హీరో సాయిరామ్ శంకర్ కొత్త సినిమా వెయ్ దరువెయ్ సినిమా నుంచి తాజా సమాచారం అందింది.
ఈ మేరకు దసరా పండక్కి ముందే ఈ యువ హీరో దరువేస్తానంటున్నాడు.అక్టోబర్ 13న ఈ చిత్రం రిలీజ్ చేస్తామని ఆయన ప్రకటించారు.సినిమాలో సాయికి జోడిగా కన్నడ నటీమణి యష శివకుమార్ నటిస్తోంది.
కొత్త దర్శకుడు నవీన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి, దేవ్ రాజ్ పోతూరు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.సాయి తేజ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపుదిద్దుకుంది.
కెరియర్ తొలిరోజుల్లో పలు సినిమాలకు డైరెక్షన్ పనులను చూసిన సాయి, తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాడు. 143, బంపర్ ఆఫర్, లాంటి హిట్ సినిమాలతో హీరోగా మెరిశాడు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
దసరాకి దరువేస్తానంటున్న హీరో సాయిరామ్ శంకర్
వెయ్ దరువెయ్ #veydharuvey releasing on oct 13th 🙏@dirnaveenreddy @actordevaraj @bheems1 @YashaShivakumar @SripalCholleti pic.twitter.com/KQlzUqricV
— Sai Raam Shankar సాయిరామ్ శంకర్ (@sairaamshankar) September 27, 2023