Pushpa 2: సోషల్ మీడియాని షేక్ చేస్తున్న అల్లు అర్జున్ 'గంగమ్మ తల్లి' అవతారం
ఈ వార్తాకథనం ఏంటి
పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.ఇక,పుష్ప 2 నుంచి ఓ గ్లింప్స్ రిలీజ్ చేసి అంచనాలు పెంచింది చిత్ర బృందం.
ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో శరవేగంగా జరుగుతుంది.
తాజాగా 'పుష్ప:ది రూల్' సినిమా షూట్ నుంచి ఓ ఫోటో లీక్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ఫోటోలో అల్లు అర్జున్ 'గంగమ్మ తల్లి' అవతారంలో కనిపిస్తున్నాడు.తిరుపతి గంగమ్మ జాతర సన్నివేశాలతో పుష్ప 2 సినిమాలో కొన్ని సీన్స్ ఉన్నాయని తెలుస్తోంది.
మేకర్స్ అంతకుముందే అల్లు అర్జున్ చీర కట్టుకున్న పోస్టర్ ని రిలీజ్ చేశారు. ప్రస్తుతం లీక్ అయిన ఫొటోలో అల్లు అర్జున్ అదే గెటప్ లో మనకి కనిపిస్తున్నాడు.
Details
ఆగస్ట్ 2024లో రిలీజ్ కానున్న పుష్ప 2
ఇప్పుడు ఈ ఫోటో వైరల్ గా మారింది. సుకుమార్ దర్శకత్వం వహించిన 'పుష్ప: ది రూల్' ఆగస్ట్ 2024లో థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
దర్శకుడు సుకుమార్ 'పుష్ప: ది రైజ్' డిసెంబర్ 2021 లో ప్రేక్షకులను అలరించింది.
ఈ సినిమా మొదటి పార్ట్ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది.
ఈ చిత్రంలో అల్లు అర్జున్, ఫహద్ ఫాసిల్, రష్మిక మందన్న ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.