
Pushpa 2: ఓవర్‌సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్‌లో పుష్ప 2 రికార్డ్.. 24 గంటల్లో మూడున్నర కోట్లు
ఈ వార్తాకథనం ఏంటి
అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 చిత్రం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది.
విడుదలకు నెల రోజుల ముందే పుష్ప ది రూల్ చిత్రానికి ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్‌ను ప్రారంభించారు. పుష్ప 2 టికెట్లు విదేశాల్లో వేడి కేకుల్లా అమ్ముడవుతున్నాయి.
ఉత్తర అమెరికాలో పుష్ప 2కి ఒకే రోజు 15,000 టికెట్లు విక్రయమయ్యాయి. మొత్తం 2750 షోలకు బుకింగ్స్ ఓపెన్ చేయగా, అన్ని షోలు హౌస్‌ఫుల్ అయ్యాయి.
ఈ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 5,000 (ఇండియన్ కరెన్సీలో మూడు కోట్లకు పైగా) కలెక్షన్స్ సాధించిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
వివరాలు
పుష్పను అధిగమించడం ఖాయం...
పుష్ప పార్ట్ 1 అమెరికాలో మొత్తంగా 2.5 మిలియన్ డాలర్ల కలెక్షన్లు సాధించింది. పార్ట్ 2 ఈ కలెక్షన్లను అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే అధిగమించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.1000 కోట్లు...
పుష్ప 2 ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.1000 కోట్లకు పైగా జరగినట్లు సమాచారం.
థియేట్రికల్ రైట్స్ దాదాపు రూ.600 కోట్లకు అమ్ముడవ్వగా, నాన్-థియేట్రికల్ హక్కులు రూ.400 కోట్లకు అమ్ముడైనట్లు తెలిసింది.
అలాగే, పుష్ప 2 OTT హక్కులు రూ.275 కోట్లకు నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్లు ప్రచారం.
వివరాలు
హైదరాబాద్‌లో ప్రత్యేక పాట...
ప్రస్తుతం పుష్ప 2 మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్‌లో అల్లు అర్జున్, శ్రీలీలపై సుకుమార్ ప్రత్యేక పాటను చిత్రీకరిస్తున్నారు.
ఈ పాటతో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవనుంది. మిగిలిన పాట కేవలం ఆడియోలో వినిపిస్తుందని చెబుతున్నారు.
500 కోట్ల బడ్జెట్...
పుష్ప 2లో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ విలన్ పాత్రల్లో కనిపించనున్నారు.
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ దాదాపు రూ.500 కోట్లతో నిర్మిస్తోంది.
వివరాలు
బెస్ట్ యాక్టర్‌గా అల్లు అర్జున్...
2021లో విడుదలైన పుష్ప ది రైజ్ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
200 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా నాలుగు వందల కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.
అల్లు అర్జున్ ఈ చిత్రానికి గాను బెస్ట్ యాక్టర్‌గా నేషనల్ అవార్డ్ పొందగా, దేవిశ్రీ ప్రసాద్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డును గెలుచుకున్నారు.