
Pushpa 2: ఏపీలో పుష్ప 2 ఫీవర్ .. డిసెంబర్ 6 నుంచి 17 వరకు ఐదు షోలకు అనుమతి
ఈ వార్తాకథనం ఏంటి
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన 'పుష్ప 2' సినిమా భారీ అంచనాల నడుమ డిసెంబరు 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది.
ప్రత్యేక ప్రీమియర్ షోలకు డిసెంబరు 4న రాత్రి 9:30 గంటల నుంచి అనుమతి లభించింది. ఈ ప్రత్యేక షోలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభం కానున్నాయి.
నైజాం ప్రాంతంలో టికెట్ రేట్లు భారీగా పెంచేందుకు ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో నూ ప్రత్యేక జీవో విడుదల చేశారు.
కానీ నైజాం కంటే రేట్లు కొద్దిగా తక్కువగా నిర్ణయించారు. ప్రీమియర్ షో టికెట్ ధర: రూ.944, సింగిల్ స్క్రీన్ రూ. 297.50, రూ.మల్టీప్లెక్స్ రూ. 377గా నిర్ణయించారు.
Details
బుకింగ్స్ ఈరోజు నుంచే ప్రారంభం
డిసెంబరు 5న తెల్లవారుజామున 1 గంటకు కూడా ప్రత్యేక షోలకు అనుమతి ఉంది.
రిలీజ్ డే రోజు ఆరు షోలు వేయడానికి గ్రీన్ సిగ్నల్ లభించగా, డిసెంబరు 6 నుంచి 17 వరకు రోజుకు ఐదు షోలు ప్రదర్శించుకోవడానికి అనుమతి ఇచ్చారు.
ఈ తేదీ వరకు పెంచిన టికెట్ రేట్లు అమల్లో ఉంటాయి. ప్రీమియర్ షోలకు సంబంధించిన బుకింగ్స్ ఈరోజు నుంచే ప్రారంభం కానున్నాయి.
పుష్ప 2 ప్రదర్శనను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని థియేటర్లలో ప్రదర్శించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
మల్టీప్లెక్స్ థియేటర్లలో లిమిటెడ్ షోలను మాత్రమే ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.