Allu Arjun: బుక్ మై షోలో 'పుష్ప 2' నెంబర్ 1 రికార్డు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'పుష్ప 2: ది రూల్' డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా మైత్రీ మూవీస్ నిర్మించిన భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే వసూళ్లలో సెన్సేషనల్‌గా మారింది. కానీ పుష్ప 2 ఇంకా ఒక కొత్త రికార్డును సృష్టించింది. బుక్ మై షో అనే టికెటింగ్ యాప్ ద్వారా పుష్ప 2 టికెట్ బుకింగ్స్‌లో కొత్త హైప్‌ను తెచ్చింది.
కేజీఎఫ్ 2 రికార్డును బద్దలు కొట్టిన పుష్ప 2
ఇప్పటి వరకు, కన్నడ స్టార్ హీరో యష్ నటించిన KGF - 2, 17.01 మిలియన్ల బుకింగ్స్ తో టాప్ స్ధానంలో నిలిచింది. ప్రభాస్ నటించిన బాహుబలి -2, ఆర్ఆర్ఆర్ కూడా ఈ టాప్ 3 స్థానాల్లో ఉండే సినిమాలుగా నిలిచాయి. కానీ ఇప్పుడు పుష్ప 2 ఈ సినిమాలను అధిగమించి ఆల్ టైం నంబర్ 1 టికెట్ బుకింగ్స్ రికార్డును సృష్టించింది. డిసెంబర్ 5న విడుదలైన పుష్ప 2 శనివారం నాటికి 17.27 మిలియన్ల బుకింగ్స్‌తో కేజీఎఫ్ 2ను వెనక్కి నెట్టింది. కేవలం 17 రోజుల్లోనే ఈ అద్భుతమైన ఘనతను సాధించిన అల్లు అర్జున్ సినిమా ప్రపంచంలో అద్భుత రికార్డును సృష్టించాడు.