
Allu Arjun: కిరణ్ అబ్బవరంకు అల్లు అర్జున్ క్షమాపణలు
ఈ వార్తాకథనం ఏంటి
అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 సినిమాకు ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అన్ని పనులు పూర్తిచేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 5న గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో ప్రమోషన్లకు మేకర్స్ స్పీడ్ పెంచారు. నవంబర్ 17, ఆదివారం నాడు పుష్ప 2 ట్రైలర్‌ను విడుదల చేశారు.
బిహార్ రాజధాని పాట్నాలో ఘనంగా నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు దాదాపు 2 లక్షల మంది హాజరైనట్లు అంచనా.
వివరాలు
పుష్ప 2 ట్రైలర్ హైలైట్‌లు
ట్రైలర్ విడుదలైన వెంటనే సినీ ప్రేమికుల నుంచి భారీ స్పందన వచ్చింది. ప్రతి సీన్‌లో ఎలివేషన్లు, యాక్షన్ సీక్వెన్స్‌లు, డైలాగులు, అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ అన్నీ ప్రేక్షకులను అబ్బురపరిచాయి.
యూట్యూబ్‌లో రికార్డులను తిరగరాసే విధంగా ట్రైలర్ వైరల్ అవుతోంది. ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు కూడా దీనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ట్వీట్:
యువ హీరో కిరణ్ అబ్బవరం, పుష్ప 2 ట్రైలర్‌పై తన అభిప్రాయాన్ని ట్విట్టర్ (ఎక్స్) వేదికగా పంచుకున్నారు. "వైల్డ్ ఫైర్.. డిసెంబర్ 5 కోసం వెయిటింగ్" అని ట్వీట్ చేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ట్వీట్
Wildfireuuuu 🔥🔥🔥
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) November 18, 2024
Dec 5th 🙏🙏🙏@alluarjun @MythriOfficial @aryasukku @iamRashmika #Pushpa2 #AAwildfire pic.twitter.com/jmDJzvskcl
వివరాలు
అల్లు అర్జున్ రిప్లై
కిరణ్ ట్వీట్‌కు వెంటనే స్పందించిన అల్లు అర్జున్, "థాంక్యూ మై బ్రదర్. అలాగే కంగ్రాట్స్. నేను బిజీగా ఉండి నీ సినిమా 'క' చూడలేకపోయాను. త్వరలో తప్పకుండా చూస్తాను," అని రిప్లై ఇచ్చారు.
దీనికి కిరణ్, "థ్యాంక్యూ అన్నా, డిసెంబర్ 5 కోసం వెయిటింగ్" అంటూ సమాధానమిచ్చాడు.
ఈ ట్వీట్స్, రీట్వీట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ సింప్లిసిటీపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.