Page Loader
Pushpa2: 25,000 మంది అభిమానుల మధ్య పుష్ప 2 ట్రైలర్ లాంచ్.. దేశంలోనే మొదటిసారి!
25,000 మంది అభిమానుల మధ్య పుష్ప 2 ట్రైలర్ లాంచ్.. దేశంలోనే మొదటిసారి!

Pushpa2: 25,000 మంది అభిమానుల మధ్య పుష్ప 2 ట్రైలర్ లాంచ్.. దేశంలోనే మొదటిసారి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 17, 2024
12:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన పుష్ప 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పుష్ప తొలి భాగం బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో, సెకండ్ పార్ట్‌పై అంచనాలు అకాశాన్ని తాకాయి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న గ్రాండ్ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఇవాళ సాయంత్రం సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ పెద్ద ఎత్తున బీహార్ లోని పాట్నా సిటీ గాంధీ మైదానంలో నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ కోసం సుమారు 25,000 మంది అభిమానులు హాజరవుతారని సమాచారం.

Details

కట్టుదిట్టమైన ఏర్పాట్లు

ఈ వేడుకను భద్రతా సిబ్బంది కట్టుదిట్టమైన ఏర్పాట్లతో నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నారు. పాట్నా సిటీలో ఉన్న హోటల్స్, లాడ్జీలు ఇప్పటికే బుకింగ్ అయినట్లు తెలుస్తోంది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలనుంచి బన్నీ ఫ్యాన్స్ తరలివచ్చారు. పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో భోజ్‌పూరి నటి అక్షర సింగ్ స్పెషల్ పెర్ఫార్మెన్స్ ఇవ్వనుంది. ఈ విషయం చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అక్షర సింగ్ టీవీ సీరియల్స్, సినిమాలలో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.