NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Pushpa Jagadish: చిక్కుల్లో పడ్డ 'పుష్ప' జగదీశ్‌..జూనియర్ ఆర్టిస్టు మృతి కేసులో అరెస్ట్
    తదుపరి వార్తా కథనం
    Pushpa Jagadish: చిక్కుల్లో పడ్డ 'పుష్ప' జగదీశ్‌..జూనియర్ ఆర్టిస్టు మృతి కేసులో అరెస్ట్
    Pushpa Jagadish: 'పుష్ప' నటుడు జగదీశ్‌ను అరెస్టు.. జూనియర్ ఆర్టిస్టుపై వేధింపులే కారణం

    Pushpa Jagadish: చిక్కుల్లో పడ్డ 'పుష్ప' జగదీశ్‌..జూనియర్ ఆర్టిస్టు మృతి కేసులో అరెస్ట్

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Dec 06, 2023
    05:30 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాలో సహాయ నటుడి పాత్ర పోషించిన జగదీశ్‌ (కేశవ) చిక్కుల్లో పడ్డారు.

    ఈ మేరకు హైదరాబాద్ పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.

    ఓ జూనియర్‌ ఆర్టిస్టు మరో వ్యక్తితో కలిసి ఉన్నప్పుడు జగదీశ్ ఫొటోలు తీశాడు. ఇదే సమయంలో సదరు జూనియర్ ఆర్టిస్టును లొంగదీసుకునేందుకు వాటిని సోషల్‌ మీడియాలో పోస్ట్ చేస్తానని బ్లాక్ మెయిల్ చేశాడు.

    ఈ క్రమంలోనే తనపై తీవ్ర బెదిరింపులు, వేధింపులకు పాల్పడిన జగదీశ్‌ను పంజాగుట్ట పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపర్చారు.

    details

    పరారీలో ఉన్న జగదీశ్ అరెస్ట్

    జగదీశ్‌ వేధింపులతో పంజాగుట్ట పరిధిలో నివాసం ఉంటున్న ఓ మహిళ (జూనియర్‌ అర్టిస్టు) గత నెల 29న ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

    ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే మహిళ ఆత్మహత్యకు గల కారణాలను ఆరా తీశారు.

    గత నెల 27న ఓ వ్యక్తితో మృతురాలు ఉన్న సమయంలో ఆమెకు తెలియకుండా జగదీశ్‌ ఫొటోలు తీశాడు.

    తర్వాత ఆమెను బెదిరింపులకు గురిచేశాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది.

    ఈ కేసులో అప్పట్నుంచి తప్పించుకుని పరారీలో ఉన్న బండారు జగదీశ్‌ను సిటీ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

    బాధిత మహిళతో జగదీశ్‌కు గతంలో సినీరంగంలో పరిచయం ఉందని పంజాగుట్ట పోలీసులు తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పుష్ప 2
    హైదరాబాద్

    తాజా

    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్
    PBKS vs RR: వధేరా-శశాంక్ విధ్వంసం.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం రాజస్థాన్ రాయల్స్
    Liquor Prices: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన ధరలు తెలంగాణ
    Russia drone attacks: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి: ఒకేసారి 273 డ్రోన్లు ప్రయోగం ఉక్రెయిన్-రష్యా యుద్ధం

    పుష్ప 2

    పుష్ప 2 కాన్సెప్ట్ టీజర్: పుష్పను చూసి రెండు అడుగులు వెనక్కి వేసిన పులి సినిమా
    పుష్ప దర్శకుడు సుకుమార్ ఇంట్లో ఐటీ సోదాలు: పుష్ప2 షూటింగ్ పై ప్రభావం  తెలుగు సినిమా
    పుష్ప 2 సెట్స్ లో జూనియర్ ఎన్టీఆర్ దర్శనం: అదే కారణమంటున్న నెటిజన్లు  తెలుగు సినిమా
    ఇండియన్ సినిమా చరిత్రలోనే పుష్ఫ-2 ఆడియో రైట్స్‌కు భారీ ఆఫర్  అల్లు అర్జున్

    హైదరాబాద్

    విభేదాలు పక్కబెట్టాల్సిందే, గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగాలి : మల్లిఖార్జున ఖర్గే  కాంగ్రెస్
    వినాయక చవితి వేళ.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు; ఈ రూట్లలో 11రోజుల పాటు రెడ్ సిగ్నల్ ఖైరతాబాద్
    Green Metro buses: హైదరాబాద్‌లో ఆర్టీసీ ప్రయాణికుల కోసం 'గ్రీన్‌ మెట్రో లగ్జరీ' ఏసీ బస్సులు  టీఎస్ఆర్టీసీ
    హైదరాబాద్ ఎంపీగా పోటీ చేయండి.. రాహుల్ గాంధీకి ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సవాల్ అసదుద్దీన్ ఒవైసీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025