Page Loader
Pushpa 2: మెట్రోలో పుష్ప రాజ్ ఫీవర్.. నయా స్టైల్ ప్రమోషన్ షూరూ!
మెట్రోలో పుష్ప రాజ్ ఫీవర్.. నయా స్టైల్ ప్రమోషన్ షూరూ!

Pushpa 2: మెట్రోలో పుష్ప రాజ్ ఫీవర్.. నయా స్టైల్ ప్రమోషన్ షూరూ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 02, 2024
04:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన పుష్ప తొలి భాగం ఘన విజయం సాధించింది. ప్రస్తుతం సీక్వెల్‌ 'పుష్ప 2'పై అంచనాలు అకాశాన్ని అంటుతాయి. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించారు. సుకుమార్ కూడా ఈసారి సహ నిర్మాతగా వ్యవహరిస్తూ, సినిమాపై ఉన్న నమ్మకాన్ని మరోసారి చాటారు. డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ సినిమా, ముందురోజు ప్రీమియర్‌ షోలు వేయడం ద్వారా ప్రేక్షకుల అంచనాలను మరింత పెంచింది. ఇప్పటికే ఈ సినిమా అనేక వాయిదాలు పడుతూ ఎట్టకేలకు డిసెంబర్ 5న రిలీజ్ కానుంది.

Details

పుష్ప 2 సినిమాపై భారీ అంచనాలు

పుష్ప 2 ప్రమోషన్స్‌ను సినిమా యూనిట్‌ మరో స్థాయికి తీసుకెళ్లింది. తాజాగా ముంబై మెట్రో రైళ్లను ఈ సినిమా పోస్టర్లతో అలంకరించడం వైరల్‌గా మారింది. రైళ్లపై 'పుష్ప 2' స్టిక్కర్లను అమర్చి, రైలు ప్రయాణికులను ఆకర్షించేలా చేయడం హాట్ టాపిక్ అయింది. దీంతో ఈ సినిమాపై భారీ హైప్‌ నెలకొంది. ఈ సినిమా మేనియా దేశం లోపలే కాదు, విదేశాల్లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. లండన్‌లో పుష్ప 2 పాటలకు ఫ్లాష్‌మాబ్ నిర్వహించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌లో భారీగా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశం ఉంది.