Page Loader
R Narayana Murthy : రామ్ చరణ్-బుచ్చిబాబు సినిమాను తిరస్కరించిన ప్రముఖ నటుడు? 
R Narayana Murthy : రామ్ చరణ్-బుచ్చిబాబు సినిమాను తిరస్కరించిన ప్రముఖ నటుడు?

R Narayana Murthy : రామ్ చరణ్-బుచ్చిబాబు సినిమాను తిరస్కరించిన ప్రముఖ నటుడు? 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 14, 2024
03:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానాతో రామ్ చరణ్ ఓ సినిమాకి సైన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అదే సమయంలో,బుచ్చిబాబు ప్రస్తుతం ఈ చిత్రానికి నటీనటులను ఎంపిక చేస్తున్నారు. ఈ చిత్రంలో కీలక పాత్ర కోసం ఆర్ నారాయణ మూర్తిని బుచ్చి బాబు సంప్రదించారు. కానీ ఆయన నో చెప్పారు. బుచ్చిబాబు ఆ పాత్ర మీరే చేయాలంటూ రిక్వెస్ట్ చేసి, భారీ పారితోషికం ఇస్తామని చెప్పినా ఆర్ నారాయణమూర్తి నో చెప్పినట్టు సమాచారం. క్యారెక్టర్‌ రోల్స్‌పై తనకు ఆసక్తి లేదని లెజెండరీ యాక్టర్‌ ఆఫర్‌ని తిరస్కరించినట్లు ఫిల్మ్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.

Details 

జూనియర్ ఆర్టిస్ట్ గా సినీ ప్రయాణం..

క్యారెక్టర్‌ రోల్స్‌పై తనకు ఆసక్తి లేదని లెజెండరీ యాక్టర్‌ ఆఫర్‌ని తిరస్కరించినట్లు ఫిల్మ్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఆర్ నారాయణ మూర్తి కమ్యూనిస్ట్ చిత్రాలకు ప్రసిద్ధి చెందారు. గతంలో పూరి జగన్నాధ్ కూడా టెంపర్ సినిమాలో పోసాని పాత్ర కోసం నారాయణ మూర్తిని సంప్రదించగా ఆయన తిరస్కరించారు. ఇప్పుడు మరోసారి రామ్ చరణ్ సినిమాలోని ఈ భారీ ఆఫర్ ని తిరస్కరించాడు. జూనియర్ ఆర్టిస్ట్ గా తన సినీ ప్రయాణం మొదలుపెట్టి ఆయన ఆ తరువాత హీరోగా, దర్శకుడిగా ఎదిగారు. ఎన్నో సూపర్ హిట్ విప్లవ సినిమాల్లో నటించి, దర్శకత్వం వహించి పీపుల్ స్టార్ గా ఎదిగారు.