
Happy Brithday Raashi Khanna : అందం.. అభినయం కలిస్తే 'రాశి ఖన్నా'
ఈ వార్తాకథనం ఏంటి
అవసరాల శ్రీనివాస్, నాగ శౌర్య కాంబినేషన్‌లో వచ్చిన ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ (Tollywood) లోకి రాశీ ఖన్నా (Raashi Khanna) ఎంట్రీ ఇచ్చింది.
తెలుగు, తమిళంలో అనేక సినిమాలు చేసి తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని రాశి ఖన్నా ఏర్పరచుకుంది.
చూడటానికి బొద్దుగా ముద్దుగా ఉన్నఈ భామ ఫస్ట్ సినిమాతోనే కుర్రకారును తన వైపునకు తిప్పుకుంది.
నేడు రాశిఖన్నా పుట్టినరోజు సందర్భంగా ఆమె గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం.
దాదాపు టాలీవుడ్‌లో కుర్ర హీరోలందరితోనూ కలిసి రాశి ఖన్నా నటించింది.
ఒక్క జూనియర్ ఎన్టీఆర్‌తో తప్ప మరో స్టార్ హీరో సినిమాలో ఆమె నటించలేదు.
జై లవకుశ సినిమాలో నటించి రాశి ఖన్నా మెప్పించినా ఆశించన స్థాయిలో అవకాశాలు రాలేదు.
Details
ఏడాది కాలంగా తెలుగు సినిమాలకు దూరమైన రాశి ఖన్నా
ఏడాది కాలంగా తెలుగు సినిమాలకు దూరమైన నటి రాశి ఖన్నా.. గతేడాది వచ్చిన 'థాంక్యూ' సినిమాలో కన్పించింది.
ఫర్జీ వెబ్ సిరీస్తో ఓటీటీలో ఈ ముద్దుగుమ్మ వార్తల్లో నిలిచింది. షాహిద్ కపూర్ హీరోగా వచ్చిన ఈ సిరీస్కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇదిలా ఉండగా.. ఇవాళ తన పుట్టిన రోజు సందర్భంగా రాశి ఖన్నా మొక్కలు నాటి, ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు రాశి ఖన్నా కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.