Page Loader
Director Rajamouli: వివాదంలో దర్శకుడు రాజమౌళి.. స్నేహితుడు సంచలన ఆరోపణలు
వివాదంలో దర్శకుడు రాజమౌళి.. స్నేహితుడు సంచలన ఆరోపణలు

Director Rajamouli: వివాదంలో దర్శకుడు రాజమౌళి.. స్నేహితుడు సంచలన ఆరోపణలు

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 27, 2025
01:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాహుబలితో దేశవ్యాప్తంగా, RRRతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ భారీ ప్రాజెక్ట్‌ను మహేష్ బాబు అభిమానులతో పాటు సినీ ప్రేమికులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇదిలా ఉండగా, తాజాగా రాజమౌళి స్నేహితుడి ఆరోపణలు సంచలనంగా మారాయి. యు. శ్రీనివాసరావు అనే వ్యక్తి, రాజమౌళితో సుమారు 34 ఏళ్ల స్నేహం ఉన్నాడని చెబుతున్నాడు. అయితే, రాజమౌళి టార్చర్‌ను తాను భరించలేకపోతున్నానని,ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమవుతున్నానని ఓ సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. అంతేకాకుండా,ఒక లేఖ కూడా రాశారు.ఈ వీడియో, లేఖ ఆధారంగా రాజమౌళిపై సుమోటో కేసు నమోదు చేయాలని పోలీసులను కోరారు.

వివరాలు 

రాజమౌళి ఎలా స్పందిస్తాడో..

అంతేకాదు, రాజమౌళికి లై డిటెక్టర్ టెస్ట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ వివాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అసలు శ్రీనివాసరావు ఎవరు? అతనికి, రాజమౌళికి మధ్య ఏమైంది? రాజమౌళి నిజంగా అతన్ని టార్చర్ చేస్తున్నాడా? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం రావాల్సి ఉంది. మరి, దీనిపై రాజమౌళి ఎలా స్పందిస్తాడో చూడాలి.