SSMB 29 : రేపు రాజమౌళి- మహేశ్ సినిమా పూజా కార్యక్రమం
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న చిత్రం SSRMB. ఈ సినిమా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కలయికలో రానుండటంతో ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.
మహేశ్ బాబు కెరీర్‌లో ఇది 29వ చిత్రం కాగా, రాజమౌళి కెరీర్‌లో కూడా అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందనుంది. అయితే ఇప్పటి వరకు ఈ చిత్రంపై అధికారిక ప్రకటన రాలేదు.
తాజాగా, SSMB 29కి సంబంధించి పెద్ద అప్డేట్ వచ్చింది. రేపు, జనవరి 2న, ఎస్.ఎస్. రాజమౌళి మరియు మహేశ్ బాబు చిత్రానికి పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఈ పూజా కార్యక్రమం హైదరాబాద్‌లోని రాజమౌళి ఆఫీస్‌లో జరగనుంది.
జనవరి చివరి వారంలో దర్శకుడు రాజమౌళి ఈ చిత్ర షూటింగ్ పనులు ప్రారంభించనున్నాడు.
వివరాలు
మొదటి షెడ్యూల్ ఆఫ్రికాలో..
ఇటీవల విదేశీ పర్యటన ముగించి హైదరాబాద్‌కు చేరుకున్న మహేశ్ బాబు ఈ కార్యక్రమానికి హాజరవుతాడా లేదా అన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
పూజా కార్యక్రమానికి దర్శకుడు రాజమౌళితో పాటు పరిశ్రమలోని కొంతమంది ప్రముఖులు కూడా హాజరు కావచ్చని సమాచారం.
మొదటి షెడ్యూల్ ఆఫ్రికాలో ప్రారంభమవుతుందనే వార్తలున్నాయి. కొద్ది రోజుల క్రితం కెన్యాలోని అంబోసెలి నేషనల్ పార్క్‌ను సందర్శించిన రాజమౌళి, అక్కడ కొన్ని లొకేషన్లను పరిశీలించారు.
దీంతో, ఫస్ట్ షెడ్యూల్ కెన్యా సహా దక్షిణ ఆఫ్రికాలోని కొన్ని లొకేషన్లలో జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై మేకర్స్ నుంచి ఇంకా స్పష్టమైన ప్రకటన రావాల్సి ఉంది.