LOADING...
Rajamouli: 'వారణాసి'లో హై-వోల్టేజ్ ఫైట్స్.. రంగంలోకి యోగేశ్ జాదవ్
'వారణాసి'లో హై-వోల్టేజ్ ఫైట్స్.. రంగంలోకి యోగేశ్ జాదవ్

Rajamouli: 'వారణాసి'లో హై-వోల్టేజ్ ఫైట్స్.. రంగంలోకి యోగేశ్ జాదవ్

వ్రాసిన వారు Moogati Shabari
Jun 24, 2026
05:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, హీరో మహేష్ బాబు కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్ఠాత్మక అడ్వెంచర్ యాక్షన్ చిత్రం 'వారణాసి'పై మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా సెట్స్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ చిత్రాల్లో రాజమౌళి పక్కన అత్యంత ఎత్తైన, భారీ శరీరాకృతితో ఉన్న వ్యక్తి కనిపించడంతో సినీ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. దాదాపు 6.5 అడుగులకుపైగా ఎత్తు ఉన్న అతడితో పోలిస్తే తాను కూడా ఎత్తుగా కనిపించేందుకు రాజమౌళి సరదాగా కుర్చీపై నిలబడిన దృశ్యాలు ప్రత్యేక ఆకర్షణగా మారాయి.

వివరాలు

వారణాసి కోసం కాశీ నగర వాతావరణం..

ఆ వ్యక్తి మరెవరో కాదు... భారతదేశానికి చెందిన ప్రముఖ ప్రొఫెషనల్ మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎంఎంఏ) ఫైటర్ యోగేశ్ జాదవ్. క్రీడా ప్రపంచంలో 'ది జెంటిల్ జెయింట్'గా గుర్తింపు పొందిన యోగేశ్, 'బిగ్ బాస్ మరాఠీ' వంటి రియాలిటీ షోల ద్వారా కూడా ప్రేక్షకులకు సుపరిచితుడు. మహేశ్ బాబు నటిస్తున్న ఈ భారీ ప్రాజెక్టులో కీలక యాక్షన్ సన్నివేశాల కోసం ఆయన సేవలను వినియోగిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, 'వారణాసి' సినిమా కోసం కాశీ నగర వాతావరణాన్ని ప్రతిబింబించేలా ప్రత్యేకంగా భారీ సెట్స్‌ను నిర్మించారు.

వివరాలు

2027 ఏప్రిల్‌లో విడుదల..

ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫొటోలు కూడా ఆ సెట్స్‌లోనే తీసినవిగా తెలుస్తోంది. యోగేశ్ జాదవ్‌తో రాజమౌళి చర్చలు జరుపుతున్న దృశ్యాలు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సినిమాలో ప్రేక్షకులను ఉర్రూతలూగించే హై-వోల్టేజ్ ఫైట్ సీక్వెన్స్‌ల రూపకల్పనలో యోగేశ్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 2027 ఏప్రిల్‌లో విడుదల చేయాలనే లక్ష్యంతో చిత్రబృందం పనులు కొనసాగిస్తోంది.

Advertisement