Rajamouli: సెట్ నుండి వీడియో లీక్.. రాజమౌళి షాకింగ్ నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
సూపర్ హిట్ సినిమా ఆర్ఆర్ఆర్ తర్వాత, దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి నుండి మరో భారీ ప్రాజెక్ట్ రాబోతోంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో హాలీవుడ్ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా 'SSMB 29' పేరుతో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం పొందుతోంది.
ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారని సమాచారం.
వివరాలు
ఓడిశాలో కొత్త షెడ్యూల్ - లీకైన వీడియో!
ఇటీవల ఈ సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్ ఓడిశాలో ప్రారంభమైంది. రాజమౌళి మహేశ్ బాబు, పృథ్వీరాజ్‌లపై కీలక సన్నివేశాలను షూట్ చేయగా, ఇందుకు సంబంధించిన వీడియో లీకైంది.
ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై చిత్రబృందం తీవ్రంగా స్పందించిన, రాజమౌళి ఇకపై భారతదేశంలో అవుట్‌డోర్ షూటింగ్స్ చేయకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
వివరాలు
భారీ సెట్లలో షూటింగ్ - హైదరాబాద్‌లో కాశీ సెట్ రెడీ!
రాజమౌళి ఎంతగా సెక్యూరిటీ పెంచినా లీక్ అవుతుందని, అందుకే భారతదేశంలో అవుట్‌డోర్ షూటింగ్స్‌కు స్వస్తి పలకాలని భావిస్తున్నారు.
తదుపరి షెడ్యూల్ కాశీలో జరగనుండగా, అందుకోసం భారీ సెట్టింగ్ నిర్మించారని తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో భారీ కాశీ సెట్ సిద్ధంగా ఉందన్న టాక్ వినిపిస్తోంది.
వివరాలు
ఒడిశా ప్రభుత్వం స్పందన!
ఈ సినిమా షూటింగ్‌పై ఒడిశా ఉప ముఖ్యమంత్రి ప్రవతి పరిదా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు.
గతంలో 'పుష్ప 2' ఒడిశాలో షూటింగ్ జరుపుకోగా, ఇప్పుడు 'SSMB 29' కూడా అక్కడే చిత్రీకరణ అవుతోంది.
ఒడిశాలో సినిమాటిక్ ల్యాండ్‌స్కేప్‌లు సమృద్ధిగా ఉన్నాయని, రాష్ట్రాన్ని ప్రైమ్ షూటింగ్ డెస్టినేషన్ గా తీర్చిదిద్దుతామని తెలిపారు.
అంతేకాకుండా, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు.
ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి రోజు రోజుకు పెరుగుతుండగా, ఇది టాలీవుడ్ నుంచి మరో పాన్ వరల్డ్ సినిమా అవుతుందనే అంచనాలు పెరుగుతున్నాయి!