LOADING...
SS Rajamouli: పెను వివాదం మధ్య వీడియో రిలీజ్ చేసిన రాజమౌళి.. అసలు విషయం ఏమిటి?
పెను వివాదం మధ్య వీడియో రిలీజ్ చేసిన రాజమౌళి.. అసలు విషయం ఏమిటి?

SS Rajamouli: పెను వివాదం మధ్య వీడియో రిలీజ్ చేసిన రాజమౌళి.. అసలు విషయం ఏమిటి?

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 01, 2025
09:35 am

ఈ వార్తాకథనం ఏంటి

అనూహ్యంగా దర్శకధీరుడు రాజమౌళి ఒక వివాదంలో చిక్కుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే అందులో ఎంతవరకు నిజం ఉందో స్పష్టత లేదు. శ్రీనివాసరావు అనే వ్యక్తి, రాజమౌళి తనతో కలిసి ఒకే మహిళను ప్రేమించారని, ఆ విషయం బయటపడుతుందని తనపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపిస్తూ ఒక వీడియో విడుదల చేశాడు. అయితే ఇండస్ట్రీ వర్గాల కథనం ప్రకారం, అతను రాజమౌళి స్నేహితుడే అయినా ఆయన చెబుతున్న మాటల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదని అంటున్నారు. ఇదిలా ఉంటే, జరిగిన వివాదంపై స్పందిస్తారని అనుకుంటున్న తరుణంలో, రాజమౌళి అందుకు భిన్నంగా 'కీరవాణి లైవ్ కన్సర్ట్' గురించి ఒక వీడియో విడుదల చేశారు.

Details

మార్చి 22న ఈవెంట్

మార్చి 22న జరిగే ఈ లైవ్ ఈవెంట్‌లో, కీరవాణి తన సినీ సంగీత ప్రయాణాన్ని శ్రోతల ముందుకు తీసుకొస్తున్నట్లు తెలిపారు. కీరవాణి తన సినిమాల పాటలతో పాటు, ఆయన కంపోజ్ చేసిన వేలాది పాటలను ప్రదర్శించనున్నారని చెప్పారు. అంతేకాక, ఈ లైవ్ కన్సర్ట్‌లో తాను కూడా పాల్గొనాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. పాటలతో పాటు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అక్కడే కంపోజ్ చేసి ప్రేక్షకులను అలరించాలని రాజమౌళి ఆకాంక్షించారు.