Varanasi: 'వారణాసి' కోసం రాజమౌళి మాస్టర్ ప్లాన్.. 50కి పైగా భాషల్లో డబ్బింగ్!
ఈ వార్తాకథనం ఏంటి
సూపర్‌స్టార్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రల్లో ఎస్‌ఎస్ రాజమౌళి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ పాన్ వరల్డ్ మూవీ 'వారణాసి'. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనగా.. తాజాగా మరో ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'వారణాసి'ని ఇప్పటికే 120కి పైగా దేశాల్లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తాజాగా ఈ చిత్రాన్ని 50కి పైగా భాషల్లో డబ్ చేయనున్నట్లు సమాచారం. ఇందుకోసం ఏకంగా 1,600 మందికి పైగా డబ్బింగ్ ఆర్టిస్టులు పనిచేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సినిమాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం పెరుగుతోంది.
వివరాలు
భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్న రాజమౌళి
అయితే నటీనటుల భావోద్వేగాలు, హావభావాలు, నటనను సహజంగా ప్రేక్షకులకు చేరవేయాలంటే మానవ స్వరం, ప్రొఫెషనల్ డబ్బింగ్ ఆర్టిస్టుల పనితీరే కీలకమని రాజమౌళి భావిస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారని సమాచారం.
అందుకే 'వారణాసి'ని వివిధ భాషల్లోకి డబ్ చేయడానికి ఏఐపై పూర్తిగా ఆధారపడకుండా.. ఆయా భాషలకు చెందిన ప్రొఫెషనల్ డబ్బింగ్ ఆర్టిస్టులతో పని చేయిస్తున్నట్లు తెలుస్తోంది.
భారీ యాక్షన్, సరికొత్త మేకింగ్‌తో తెరకెక్కుతున్న 'వారణాసి'ని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లేందుకు రాజమౌళి భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
120కి పైగా దేశాలు, 50కి పైగా భాషలు, 1,600 మందికి పైగా డబ్బింగ్ ఆర్టిస్టులతో ఈ సినిమా గ్లోబల్ రిలీజ్ ప్లాన్ ఇప్పటికే ఆసక్తిని పెంచుతోంది.