
SS Rajamouli: స్టార్ హీరోలకంటే రాజమౌళికే రెమ్యునరేషన్ ఎక్కువ.. నివేదికిచ్చిన IMDB
ఈ వార్తాకథనం ఏంటి
దర్శకధీరుడు రాజమౌళి మరోసారి తన సత్తా చాటేశారు. దేశంలోనే నెంబర్ వన్ డైరెక్టర్‌గా నిలిచిన ఆయన ప్రస్తుతం రెమ్యునరేషన్ పరంగా కూడా అగ్రస్థానంలో ఉన్నారు.
ఇటీవల ప్రముఖ సినిమా డేటాబేస్ సంస్థ IMDB విడుదల చేసిన నివేదిక ప్రకారం, రాజమౌళి ఒకే ఒక్క సినిమాకు రూ.200 కోట్లు రెమ్యునరేషన్‌గా తీసుకుంటున్నట్టు వెల్లడైంది.
ఈ మొత్తం కేవలం పారితోషికంగా మాత్రమే కాదు, ప్రాజెక్టుల్లో లాభాల వాటా రూపంలోనూ వస్తోందని సమాచారం.
స్టార్ హీరోలకంటే ఎక్కువగా పారితోషికం అందుకుంటున్న ఏకైక దర్శకుడిగా రాజమౌళి నిలిచినట్టు నివేదిక పేర్కొంది. ఇప్పటివరకు ఏ ఇండియన్ డైరెక్టర్ ఈ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకున్నట్లు లేదని స్పష్టం చేసింది.
Details
రాజమౌళి సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు
ఇతర ప్రముఖ దర్శకుల విషయానికొస్తే, 'కేజీఎఫ్', 'సలార్' చిత్రాలతో గుర్తింపు పొందిన ప్రశాంత్ నీల్, అలాగే 'అర్జున్ రెడ్డి', 'అనిమల్' చిత్రాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఒక్కో సినిమాకు సుమారు రూ.90 కోట్లు తీసుకుంటున్నారని నివేదిక వెల్లడించింది.
ఆ తర్వాతి స్థానాల్లో సుకుమార్, రాజ్ కుమార్ హిరానీ వంటి దర్శకులు ఒక్కో ప్రాజెక్టుకు సుమారు రూ.80 కోట్ల వరకూ పారితోషికం పొందుతున్నట్టు పేర్కొంది.
రాజమౌళి సినిమాలకు దేశీయంగా మాత్రమే కాక, ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉండటం, కోట్లాది రూపాయల లాభాలు తీసుకురావడం వల్ల ఆయన రెమ్యునరేషన్ పూర్తిగా న్యాయసమ్మతమేనంటున్నారు ఫ్యాన్స్.
"వేల కోట్లు కొల్లగొట్టే సినిమాలు తీసే డైరెక్టర్‌కు ఈ స్థాయిలో రెమ్యునరేషన్ న్యాయమే" అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.