Priyanka Chopra: రాజమౌళి ట్విస్ట్ అదిరింది.. SSMB 29లో ప్రియాంక చోప్రా రోల్ లీక్!
ఈ వార్తాకథనం ఏంటి
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ చిత్రం 'SSMB 29'. ప్రస్తుతం ఒడిశాలో ఈ మూవీ షూటింగ్ జరుగుతుండగా, మొదటి రోజే ఓ వీడియో లీక్ కావడంతో అది వైరల్‌గా మారింది.
జక్కన్న తీసిన కొన్ని సన్నివేశాలు బయటకు రావడంతో, ఇకపై షూటింగ్‌లో మరింత కఠిన నిబంధనలు అమలు చేయాలని రాజమౌళి నిర్ణయించినట్లు సమాచారం.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
Details
నెగటివ్ రోల్ లో ప్రియాంక
ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిసిందే. ఆమెను రాజమౌళి నెగటివ్ షేడ్‌లో చూపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇప్పటి వరకు సినిమా హీరోయిన్ ఎవరన్నది అధికారికంగా ప్రకటించలేదు.
అయితే ప్రియాంక పాత్రపై వచ్చిన ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
రాజమౌళి సినిమాల్లో సస్పెన్స్, ట్విస్ట్‌లు మాములుగా ఉండవు. ఆయన ఏదైనా కొత్తగా చేస్తే అది సంచలనంగా మారడం ఖాయం.
ప్రస్తుతం చక్కర్లు కొడుతున్న ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో చూడాలి.
Details
మూవీ సెట్లో ప్లాస్టిక్ వినియోగం పూర్తిగా నిషేధం
ఇకపోతే రాజమౌళి తన సినిమాల షూటింగ్ సమయంలో నటీనటుల పెర్ఫార్మెన్స్‌తో పాటు సెట్‌లో క్రమశిక్షణ, పర్యావరణ పరిరక్షణపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తారు.
ఇదే విషయాన్ని ఈసారి కూడా అమలు చేస్తున్నారు. ఈ మూవీ సెట్లో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించారు. షూటింగ్ ప్రదేశంలో కఠినమైన నిబంధనలు అమలవుతున్నట్లు తెలుస్తోంది.
ప్రియాంక చోప్రాకు మేకప్, వ్యక్తిగత సహాయకులుగా దాదాపు 13 మంది ఉండడం సాధారణమే. కానీ ఈ సెట్లో కేవలం ఇద్దరికే అనుమతి ఇవ్వడం ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.