Jailer-Rajinikanth-cinema: జైలర్ కు సీక్వెల్ గా హుకుం...రజనీకాంత్, నెల్సన్ కాంబో ఇక రచ్చ రచ్చే
ఈ వార్తాకథనం ఏంటి
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కాంబినేషన్ లో గతేడాది వచ్చిన సూపర్ హిట్ బాక్సాఫీస్ బొనంజా సినిమా జైలర్.
గతేడాది విడుదలై రూ.600 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది.
నిర్మాతకు కూడా బాగానే లాభాలు తెచ్చిపెట్టిన సినిమాగా గతేడాది నిలిచిపోయింది.
ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ అందించిన నేపథ్య సంగీతం సినిమాను ఓ స్థాయికి తీసుకెళ్లింది.
ఇప్పటికీ సోషల్ మీడియాలో సినిమా పాటలకు నెటిజన్లు రీల్స్ చేస్తూనే ఉన్నారు.
తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ గా జైలర్ 2 రాబోతుందని వార్తలు వెలువడుతున్నాయి.
అఫీషియల్ గా ఈ సినిమాకు సంబంధించి ప్రకటన చేయనప్పటికీ ఈ చిత్రం సీక్వెల్ పనుల్ని దర్శకుడు నెల్సన్ ఇప్పటికే మొదలు పెట్టేశాడని కోలివుడ్ చర్చించుకుంటోంది.
Jailer Ka Hukum
త్వరలోనే షూటింగ్ ప్రారంభం...
ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా త్వరలోనే ప్రారంభమవుతాయని టాక్ నడుస్తోంది.
జైలర్ సినిమాకు సీక్వెల్ కు హుకుం అనే టైటిల్ పెట్టనున్నారని సమాచారం.
జైలర్ సినిమాలో రజనీకాంత్ తోపాటు మలయాళ నటుడు మోహన్ లాల్, కన్నడ నటుడు శివరాజ్ కుమార్, బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్ కీలకపాత్రలు పోషించిన విషయం తెలిసిందే.
వీరితో పాటు తమన్నా, సునీల్, రమ్యకృష్ణ కూడా ప్రధాన పాత్రల్లో ఆకట్టుకున్నారు.
జైలర్ సీక్వెల్ లో కూడా వీరంతా ఉండనున్నారని తెలుస్తోంది.