Page Loader
Rajinikanth: హాస్పిటల్ నుంచి రజనీకాంత్‌ డిశ్చార్జ్‌.. అభిమానులకు అభివాదం చేస్తూ ఇంటికి
హాస్పిటల్ నుంచి రజనీకాంత్‌ డిశ్చార్జ్‌

Rajinikanth: హాస్పిటల్ నుంచి రజనీకాంత్‌ డిశ్చార్జ్‌.. అభిమానులకు అభివాదం చేస్తూ ఇంటికి

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 04, 2024
10:01 am

ఈ వార్తాకథనం ఏంటి

చెన్నై అపోలో ఆసుపత్రి నుండి రజనీకాంత్ డిశ్చార్జ్ అయ్యారు. గురువారం రాత్రి 11 గంటలకు ఆయన ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. సెప్టెంబర్ 30న రజనీకాంత్ చెన్నైలోని ఆసుపత్రిలో చేరగా, వైద్యులు శస్త్రచికిత్స చేసి ఆయన గుండెలో స్టెంట్ వేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. రజనీకాంత్ గుండె నుంచి రక్తప్రసరణ జరిగే ముఖ్యమైన రక్తనాళంలో వాపు ఏర్పడింది,దీనికి ట్రాన్స్‌కాథెటర్ పద్ధతిలో చికిత్స అందించి స్టెంట్ అమర్చారు. ఆయన ఆసుపత్రిలో చేరినట్లు తెలుసుకున్న అభిమానులు,సినీ,రాజకీయ ప్రముఖులు రజనీకాంత్ త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేశారు. ప్రస్తుతం ఆయన ఇంటికి చేరడంతో అందరూ సంతోషంగా ఉన్నారు.ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన రజనీకాంత్,అభిమానులకు అభివాదం చేస్తూ ఇంటికి వెళ్లారు.

వివరాలు 

మూడు వారాల తర్వాత షూటింగ్‌కు! 

రజనీకాంత్ పూర్తిగా కోలుకున్న తర్వాత 'కూలీ' అనే సినిమా షూటింగ్‌లో చేరబోతున్నారని కోలీవుడ్ మీడియా తెలిపింది. ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో రజనీకాంత్ పూర్తిగా కోలుకున్న తర్వాత మాత్రమే చిత్రీకరణలో పాల్గొననున్నారు. మూడు వారాల తర్వాత రజనీకాంత్ షూటింగ్‌లో పాల్గొననున్నారని సమాచారం. ఈ లోగా ఇతర నటీనటులతో సంబంధిత సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో నాగార్జున, శ్రుతి హాసన్, సత్యరాజ్, ఉపేంద్ర తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రజనీకాంత్ నటించిన మరో చిత్రం 'వేట్టయాన్' అక్టోబర్ 10న విడుదల కానుంది.