Page Loader
Rajini Kanth: నిలకడగా రజనీకాంత్‌ ఆరోగ్యం.. తాజా హెల్త్‌ అప్‌డేట్ ఇదే..
నిలకడగా రజనీకాంత్‌ ఆరోగ్యం.. తాజా హెల్త్‌ అప్‌డేట్ ఇదే..

Rajini Kanth: నిలకడగా రజనీకాంత్‌ ఆరోగ్యం.. తాజా హెల్త్‌ అప్‌డేట్ ఇదే..

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 03, 2024
02:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

అగ్ర కథానాయకుడు రజనీకాంత్ ఇటీవల ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని సమాచారం. సెప్టెంబర్ 30న రజనీకాంత్ చెన్నైలోని ఆసుపత్రిలో చేరారు. వైద్యులు ఆయనకు శస్త్రచికిత్స చేసి గుండెలో స్టెంట్‌ వేశారు. అయితే, ఈరోజు డిశ్చార్జ్ కావాల్సినప్పటికీ, వైద్యుల సూచన మేరకు రజనీకాంత్‌ను మరో రోజు పరిశీలనలో ఉంచినట్లు తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, శుక్రవారం డిశ్చార్జ్ కానున్నట్లు తెలుస్తోంది. రజనీకాంత్ గుండె నుంచి ప్రధాన రక్తనాళంలో వాపు ఏర్పడిన కారణంగా, వైద్యులు ట్రాన్స్‌కాథెటర్ పద్ధతిని ఉపయోగించి చికిత్స చేసి స్టెంట్ అమర్చారు.

వివరాలు 

అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు వేట్టయాన్

రజనీ ఆసుపత్రిలో చేరిన విషయం తెలుసుకున్న అభిమానులు, సినీ మరియు రాజకీయ ప్రముఖులు, ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, హీరో కమల్ హాసన్, విజయ్ తదితరులు ఎక్స్ వేదిక ద్వారా రజనీకాంత్ త్వరగా ఇంటికి తిరిగి రావాలని ఆకాంక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా రజనీకాంత్ భార్య లతాతో ఫోన్‌లో మాట్లాడి, ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు, త్వరగా కోలుకోవాలని కోరారు. ప్రస్తుతం ఈ అగ్ర కథానాయకుడు రెండు సినిమాల్లో నటిస్తున్నారు. ఆయన తాజా చిత్రం 'వేట్టయాన్' ట్రైలర్‌ ఇటీవల విడుదలై మంచి ప్రేక్షకాదరణను పొందింది. టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.