Vettaiyan Trailer: రజనీకాంత్ 'వేట్టయన్' ట్రైలర్ రిలీజ్.. అభిమానుల్లో సరికొత్త ఉత్సాహం!
సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'వేట్టయన్' ట్రైలర్ ఎట్టకేలకు విడుదలైంది. బుధవారం సాయంత్రం సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందం ఈ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. రజనీకాంత్ ప్రధాన పాత్రలో, టి.జె. జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్ వంటి ప్రతిష్టాత్మక నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాను ఈ నెల 10న గ్రాండ్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ ట్రైలర్ వేట్టయన్ చిత్రానికి సంబంధించి భారీ యాక్షన్ సన్నివేశాలు, రజనీకాంత్ పవర్ ప్యాక్ డైలాగ్స్‌తో అభిమానులను ఆకట్టుకుంటోంది.