LOADING...
Rajinikanth: ప్రముఖ బాలీవుడ్ నిర్మాతతో జత కట్టిన సూపర్‌స్టార్ రజనీకాంత్ 
ప్రముఖ బాలీవుడ్ నిర్మాతతో జత కట్టిన సూపర్‌స్టార్ రజనీకాంత్

Rajinikanth: ప్రముఖ బాలీవుడ్ నిర్మాతతో జత కట్టిన సూపర్‌స్టార్ రజనీకాంత్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 27, 2024
04:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన రీసెంట్ చిత్రం"లాల్ సలామ్".ఈ చిత్రం డిజాస్టర్ అయ్యింది. లాల్ సలామ్ ఫెయిల్యూర్ తో రజనీ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. తలైవర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. ప్రస్తుతం రజినీ కాంత్,బాలీవుడ్ కి చెందిన ప్రముఖ నిర్మాత రచయితా, దర్శకుడు సాజిద్ నడియాడ్ వాలాతో ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నారు. హౌస్‌ఫుల్ సిరీస్,2 స్టేట్స్,సూపర్ 30,ఛిచోరే,తమాషా,కిక్,ఇటీవలి హిట్ అయిన సత్య ప్రేమ్ కి కథ వంటి చిత్రాలకు సాజిద్ నడియాడ్‌వాలా నిర్మాత. రజనీకాంత్,సాజిద్ నదియాడ్‌వాలా కాంబోలో ఇది ​​మొదటి ప్రాజెక్ట్. ప్రస్తుతానికి, దర్శకుడు,ఇతర తారాగణం సిబ్బందికి సంబంధించిన వివరాలను ప్రొడక్షన్ హౌస్ ప్రకటించలేదు. ప్రస్తుతానికి,సూపర్‌స్టార్ వేట్టైయాన్‌తో బిజీగా ఉన్నారు.ఆతర్వాత అతను లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తలైవర్ 171చేయనున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సాజిద్ నడియాడ్ వాలాతో రజినీకాంత్