
Rajinikanth :సెమీస్ కోసం ముంబై చేరుకున్న రజినీకాంత్.. నేడు భారత్ కివీస్ ఢీ
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియా న్యూజిలాండ్ మధ్య ఇవాళ సెమీస్ జరగనుంది. ఈ మేరకు మ్యాచ్ చూసేందుకు దక్షిణ భారత సూపర్ స్టార్ రజినీకాంత్ ఇప్పటికే ముంబై చేరుకున్నారు.
టీమిండియా గమ్యాన్ని నిర్దేశించేే కీలక మ్యాచ్ ను వీక్షించేందుకు బుధవారం వాంఖడే స్టేడియం పయనమయ్యారు.
ఈ క్రమంలోనే ఎయిర్ పోర్ట్ వద్ద ఈ జైలర్,తళుక్కుమని మెరిశారు.దీంతో తలైవర్ ఫోటోలు వైరల్ అయ్యాయి.
గత ప్రపంచ కప్ లో భాగంగా కివీస్, టీమిండియాను సెమీస్ లోనే దెబ్బకొట్టింది.అయితే ఈసారి మ్యాచ్ భారతదేశంలో జరుగుతోంది.
ఇదే సమయంలో ఈసారి భారత్ మహా జోరుమీదుంది.దీంతో ఈ మ్యాచ్ కోసం యావత్ దేశం ఉత్కంఠగా ఎదురు చూస్తోంది.
మరోవైపు జైలర్ భారీ విజయంతో ఉన్న రజనీ తాజాగా 170వ సినిమా రెఢీ అవుతోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మ్యాచ్ కోసం ముంబై చేరుకున్న రజినీకాంత్
Photos : #Rajinikanth arrives in Mumbai to watch IND vs NZ match https://t.co/2llezmKiWQ#INDvsNZ #IndiaVsNewZealand #Semifinals #WorldCup2023 #123telugu pic.twitter.com/RG8kTmPFIK
— 123telugu (@123telugu) November 15, 2023