Page Loader
Rakul Preet Singh: వైరల్ అవుతున్న రకుల్, జాకీ వెడ్డింగ్ కార్డ్.. ప్రేమలో పడిన చోటే పెళ్లి 
Rakul Preet Singh: వైరల్ అవుతున్న రకుల్, జాకీ వెడ్డింగ్ కార్డ్.. ప్రేమలో పడిన చోటే పెళ్లి

Rakul Preet Singh: వైరల్ అవుతున్న రకుల్, జాకీ వెడ్డింగ్ కార్డ్.. ప్రేమలో పడిన చోటే పెళ్లి 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 12, 2024
01:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్, నిర్మాత-నటుడు జాకీ భగ్నాని ఫిబ్రవరి 21 న వివాహం చేసుకోబోతున్నారు. వీరి పెళ్లిక సంబంధించిన వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శుభలేఖలో మండపం చుట్టూ కొబ్బరి చెట్లను సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో ముద్రించారు . #ABDONOBHAGNA-NI అనే హ్యాష్‌ట్యాగ్‌ని కలిగి ఉన్న ఓపెనింగ్ కార్డ్ నీలం, తెలుపు రంగులో ఉంది. కొన్నాళ్ల పాటు డేటింగ్ చేసిన రకుల్, జాకీ తమ పెళ్లికి వేదికగా గోవాను ఎంచుకున్నారు. దీనివెనక కూడా ఓ కారణం ఉంది. వారిద్దరూ లవ్‌లో పడింది ఇక్కడేనట.

Details 

ఇద్దరూ ఒకే ఏడాది సినీ రంగంలోకి

జాకీ తొలి చిత్రం కల్ కిస్నే దేఖా, ఇది 2009లో విడుదలైంది. ఆ తర్వాత అతను 'F.A.L.T.U', అజబ్ గజబ్ లవ్, రంగేజ్,యంగిస్తాన్ వంటి అనేక సినిమాల్లో నటించాడు. రకుల్ ప్రీత్ సింగ్ 2009లో కన్నడ చిత్రం గిల్లితో అరంగేట్రం చేసింది. యారియాన్ చిత్రంతో హిందీ సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టిన రకుల్ సింగ్ ఆ తర్వాత 'దే దే ప్యార్ దే', 'రన్‌వే 34', 'ఛత్రివాలి', 'ఐ', లవ్ యు','డాక్టర్ జి' వంటి సినిమాల్లో నటించింది. తెలుగులో ఆమె మొదటి సినిమా వెంకటాద్రి ఎక్ష్ప్రెస్స్. ఈ సినిమాలో సందీప్ కిషన్ తో కలిసి నటించింది. ఆ తరువాత తెలుగులో స్టార్ హీరోస్ తో కలిసి నటించి మెప్పించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డు