Loading...
Ramcharan: మరో ట్రాన్స్‌ఫార్మేషన్‌లోకి రామ్ చరణ్..?
మరో ట్రాన్స్‌ఫార్మేషన్‌లోకి రామ్ చరణ్..?

Ramcharan: మరో ట్రాన్స్‌ఫార్మేషన్‌లోకి రామ్ చరణ్..?

వ్రాసిన వారు Moogati Shabari
Aug 12, 2026
09:36 am

ఈ వార్తాకథనం ఏంటి

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన కొత్త సినిమా 'RC17' కోసం మరోసారి సరికొత్త లుక్‌లో కనిపించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించనున్న ఈ సినిమా కోసం చరణ్ ఏకంగా 15 కిలోల వరకు బరువు తగ్గి స్లిమ్‌గా కనిపించనున్నట్లు సమాచారం. అంతేకాదు.. ఈ పాత్రకు తగ్గట్టుగా పొడవాటి జుట్టును కూడా పెంచనున్నాడట.

వివరాలు

పూర్తిగా మారనున్న లుక్..

'RC17' చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో భారీగా తెరకెక్కించేందుకు సుకుమార్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నాడు.

ఇప్పటికే సినిమా తొలి భాగానికి సంబంధించిన కథ పూర్తయినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం క్లైమాక్స్‌పై సుకుమార్ వర్క్ చేస్తున్నాడట. ఇక చేతికి అయిన గాయం నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత రామ్ చరణ్.. 'RC17' కోసం బరువు తగ్గే ట్రెయినింగ్‌ను ప్రారంభించనున్నట్లు సమాచారం.

ఈ సినిమా కోసం చరణ్ మరోసారి తన లుక్‌ను పూర్తిగా మార్చుకోబోతుండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

ADVERTISEMENT