రామ్ చరణ్ కూతురు బారసాల ఫంక్షన్ ఈరోజే: అదిరిపోయే బహుమతిని పంపిన అంబానీ
ఈ వార్తాకథనం ఏంటి
రామ్ చరణ్, ఉపాసన దంపతులు పండంటి పాపకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. పెళ్ళయిన పదకొండేళ్ల తర్వాత మెగా ఇంట్లోకి వారసురాలు వచ్చేసింది.
అయితే ఈరోజు మెగా వారసురాలి బారసాల ఫంక్షన్ జరగనుందని వార్తలు వస్తున్నాయి. పాపకు ఈరోజే పేరు పెడతారన్నమాట.
ఆల్రెడీ ఏ పేరు పెట్టాలో ఫిక్స్ అయినట్లుగా అపోలో హాస్పిటల్స్ నుండి డిశ్చార్జ్ అయ్యే సమయంలో రామ్ చరణ్ తెలియజేసాడు.
ఇప్పుడు పేరు పెట్టే తరుణం వచ్చేసింది కాబట్టి ఏ పేరు పెట్టబోతున్నారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.
అదలా ఉంచితే, మెగా వారసురాలి బారసాల ఫంక్షన్ కోసం భారత కుబేరుడు ముఖేష్ అంబానీ అదిరిపోయే బహుమతిని పంపించారని సమాచారం.
Details
బహుమతిగా బంగారు ఊయల
మెగా ప్రిన్సెస్ కోసం ఏకంగా బంగారు ఊయలను బహుమతిగా పంపించారని తెలుస్తోంది. ఈరోజు బంగారు ఊయలలోనే పాపకు బారసాల ఫంక్షన్ జరగనుందని అంటున్నారు.
బహుమతిగా బంగారు ఊయల విషయం నెట్టింట్లో వైరల్ గా మారిపోయింది. పాప పుట్టిన తర్వాత తాము అత్తా మామలతో కలిసే ఉంటామని, పాపకు నాన్నమ్మ, తాతయ్యలతో మంచి బంధం ఏర్పడాలని తాను కోరుకుంటున్నట్లుగా ఉపాసన తెలియజేసారు.
గ్రాండ్ పేరెంట్స్ తో బంధం ఎంత బాగుంటుందో తనకు తెలుసనీ, ఆ బంధాన్ని తన కూతురుకు అందివ్వాలన్న ఉద్దేశ్యంతో తాము అత్తమామలతో ఒకే ఇంట్లో ఉండబోతున్నట్లుగా ఉపాసన తెలిపారు.