LOADING...
Ram Charan: మెగాస్టార్ చిరంజీవిపై ఎమోషనల్ కామెంట్స్.. రామ్ చరణ్ ఏమన్నాడంటే
మెగాస్టార్ చిరంజీవిపై ఎమోషనల్ కామెంట్స్.. రామ్ చరణ్ ఏమన్నాడంటే

Ram Charan: మెగాస్టార్ చిరంజీవిపై ఎమోషనల్ కామెంట్స్.. రామ్ చరణ్ ఏమన్నాడంటే

వ్రాసిన వారు Moogati Shabari
Apr 17, 2026
10:44 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న 'పెద్ది' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ కథానాయికగా కనిపిస్తోంది. చిత్రీకరణ దాదాపు పూర్తయిన ఈ సినిమాను, ప్రేక్షకులకు మెరుగైన థియేటర్ అనుభూతి ఇవ్వాలనే ఉద్దేశంతో జూన్ నెలకు విడుదలను వాయిదా వేశారు. ఇదిలా ఉండగా, సినిమాలతో బిజీగా ఉన్న చరణ్ మరో అంతర్జాతీయ గౌరవాన్ని కూడా సొంతం చేసుకున్నాడు. ప్రముఖ 'ఈ స్క్వేర్ ఇండియా' మ్యాగజైన్ కవర్‌పై కనిపించిన టాలీవుడ్ హీరోగా ఆయన ప్రత్యేక గుర్తింపును సాధించాడు.

వివరాలు

నిజమైన హీరో నాన్న..

ఈ సందర్భంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ చరణ్ తన వ్యక్తిగత జీవితం, వృత్తి జీవితంపై తండ్రి చిరంజీవి ప్రభావం గురించి ప్రస్తావించాడు. తన జీవితంలో నిజమైన హీరో చిరంజీవేనని ఆయన గర్వంగా చెప్పాడు. తండ్రి సంపాదించిన స్థాయిని అందుకోవడం సులభంగా కనిపించినా, దాని వెనుక ఆయన చేసిన కష్టం అమూల్యమని పేర్కొన్నాడు. షూటింగ్‌ల కారణంగా రోజుకు కేవలం నాలుగు గంటలే నిద్రపోయినా, కుటుంబానికి సమయం కేటాయించడంలో ఎప్పుడూ వెనుకాడలేదని వివరించాడు.

వివరాలు

నెట్టింట రామ్ చరణ్ కామెంట్స్ వైరల్

ఎంతటి స్టార్ అయినా ఇంట్లో మాత్రం సాధారణ తండ్రిలా వ్యవహరించడం చిరంజీవికే సాధ్యమని చరణ్ అన్నారు. కష్టాల్లో ఉన్న సినీ పరిశ్రమకు చెందినవారికి అండగా నిలవడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారని కొనియాడాడు. వృత్తి బాధ్యతలు, కుటుంబ సంబంధాల మధ్య సమతౌల్యం ఎలా పాటించాలో తండ్రిని చూసే నేర్చుకున్నానని తెలిపాడు. ఎన్నో అడ్డంకులు వచ్చినా ధైర్యంగా ముందుకు సాగే చిరంజీవి ధోరణి తనపై గొప్ప ప్రభావం చూపిందని, తాను కూడా అదే మార్గాన్ని అనుసరిస్తున్నానని చెప్పాడు. కొద్దిపాటి విరామం లభించినా కుటుంబంతో గడపడానికి ప్రాధాన్యత ఇచ్చే తండ్రి క్రమశిక్షణ తనకు ప్రేరణగా నిలిచిందని చరణ్ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం పొందుతున్నాయి.

Advertisement