LOADING...
Peddi: బాబాయ్ రికార్డులను బద్దలు కొట్టిన అబ్బాయ్.. రిలీజ్‌కు ముందే 'పెద్ది' సంచలనం
బాబాయ్ రికార్డులను బద్దలు కొట్టిన అబ్బాయ్.. రిలీజ్‌కు ముందే 'పెద్ది' సంచలనం

Peddi: బాబాయ్ రికార్డులను బద్దలు కొట్టిన అబ్బాయ్.. రిలీజ్‌కు ముందే 'పెద్ది' సంచలనం

వ్రాసిన వారు Moogati Shabari
May 09, 2026
04:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'పెద్ది' విడుదలకు ముందే సంచలనాలు సృష్టిస్తోంది. ఈ చిత్రానికి బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. 'ఉప్పెన' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన బుచ్చిబాబు, తొలి చిత్రంతోనే భారీ విజయాన్ని అందుకుని ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ఆ సినిమా తర్వాత కొంత విరామం తీసుకున్న ఆయన, ఇప్పుడు 'పెద్ది'తో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ పూర్తిగా భిన్నమైన అవతారంలో కనిపించనున్నారని ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, పాటలు స్పష్టం చేశాయి. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది.

వివరాలు

బుకింగ్స్‌లో సరికొత్త రికార్డు..

ఈ చిత్రానికి సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన అందుకుని చార్ట్‌బస్టర్‌లుగా నిలిచాయి. దర్శకుడు బుచ్చిబాబు ఈ సినిమాను భారీ యాక్షన్‌తో పాటు భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇచ్చే విధంగా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. జూన్ 4న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కానుంది. అయితే విడుదలకు ముందే 'పెద్ది' అరుదైన రికార్డులను సొంతం చేసుకోవడం విశేషం. ముఖ్యంగా నార్త్ అమెరికా అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఈ సినిమా కొత్త మైలురాయిని నెలకొల్పింది.

వివరాలు

950కి పైగా ప్రీమియర్ షోలు..

ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ నటించిన 'ఓజీ', జూనియర్ ఎన్టీఆర్ 'దేవర', అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2', అలాగే ప్రభాస్ 'సలార్' వంటి భారీ చిత్రాలు చేశారు. తొలి 24 గంటల్లో సాధించిన అడ్వాన్స్ బుకింగ్ వసూళ్లను 'పెద్ది' కేవలం నాలుగు గంటల్లోనే అధిగమించడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నార్త్ అమెరికాలో ఈ చిత్రాన్ని ప్రత్యంగిర సినిమాస్ భారీ స్థాయిలో విడుదల చేయనుంది. అక్కడ దాదాపు 950కు పైగా ప్రీమియర్ షోలను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Advertisement