Page Loader
Ram Charan: సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి.. రామ్ చరణ్ ట్వీట్ వైరల్
సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి.. రామ్ చరణ్ ట్వీట్ వైరల్

Ram Charan: సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి.. రామ్ చరణ్ ట్వీట్ వైరల్

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 05, 2023
03:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే తీవ్రం దూమారం రేపుతున్నాయి. గతంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేసిన ట్విట్ ఒకటి వైరల్‌గా మారింది. తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన కామెంట్స్ పై ఇప్పటికే దేశవ్యాప్తంగా హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి. పలు చోట్లు హిందూ సంఘ నాయకులు ఉదయ నిధి స్టాలిన్ పై కేసులు కూడా నమోదు చేశారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఉదయ నిధి స్టాలిన్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని కొంతమంది అభిమానులు సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేస్తున్నారు.

Details

ఉదయనిధి స్టాలిన్ పై సోషల్ మీడియా వేదికగా విమర్శలు

డెంగ్యూ, మలేరియా ఎలాగో, సనాతన ధర్మం కూడా అంతేనని, దాన్ని నిర్మూలించాలంటూ తమిళనాడు‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఉదయనిధి ఘాటైనా కామెంట్స్ చేశాడు. ఈ తరుణంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ చేసిన పాత ట్విట్ వైరల్‌గా మారింది. సనాతన ధర్మాన్ని రక్షించుకోవడ అందరి బాధ్యత అని, ఇది భారతీయ కల్చర్ మ్యాటర్స్ అంటూ 2020లో రాంచరణ్ ట్విట్ చేశారు. ఇందులో తన తల్లి సురేఖ తులసి మెక్కకు పూజ చేస్తున్న ఫోటోను షేర్ చేశారు. ఉదయనిధి కామెంట్స్ నేపథ్యంలో చరణ్ ట్వీట్ ని నెటిజన్లు ఇప్పుడు వైరల్‌గా చేస్తున్నారు. సనాతన ధర్మం పట్ల సీఎం తనయుడు అభిప్రాయం, చిరంజీవి కొడుకు అభిప్రాయం ఎలా ఉన్నాయో చూడండి అంటూ నెటిజన్లు పోస్టు పెడుతున్నారు.