Page Loader
రామ్ చరణ్ లాంచ్ చేయనున్న భోళాశంకర్ ట్రైలర్: ఎప్పుడు విడుదల కానుందంటే? 
భోళాశంకర్ ట్రైలర్ ను లాంచ్ చేయనున్న రామ్ చరణ్

రామ్ చరణ్ లాంచ్ చేయనున్న భోళాశంకర్ ట్రైలర్: ఎప్పుడు విడుదల కానుందంటే? 

వ్రాసిన వారు Sriram Pranateja
Jul 26, 2023
04:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

చిరంజీవి హీరోగా మెహెర్ రమేష్ దర్శకత్వంలో భోళాశంకర్ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. తమన్నా భాటియా హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ సినిమా నుండి ఇప్పటివరకు మూడు పాటలు రిలీజ్ అయ్యాయి. తాజాగా ఈ సినిమా నుండి ఖతర్నాక్ అప్డేట్ వచ్చింది. భోళాశంకర్ నుండి ఇదివరకు టీజర్ రిలీజైంది. ఇప్పుడు ట్రైలర్ ని రిలీజ్ చేయబోతున్నారు. ఈ మేరకు ప్రకటన వచ్చింది కూడా. రామ్ చరణ్ చేతుల మీదుగా భోళాశంకర్ ట్రైలర్ రిలీజ్ కాబోతుందని చిత్రబృందం వెల్లడి చేసింది. జులై 28వ తేదీన సాయంత్రం 4:05గంటలకు రామ్ చరణ్ చేతుల మీదుగా ట్రైలర్ విడుదల అవుతుంది. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్లో రూపొందుతున్న ఈ సినిమా. ఆగస్టు 11వ తేదీన రిలీజ్ అవుతుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

భోళాశంకర్ ట్రైలర్ రిలీజ్ పై నిర్మాణ సంస్థ ట్వీట్