Ram : యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలనుతో రామ్ పోతినేని..?
ఈ వార్తాకథనం ఏంటి
మన టాలీవుడ్ యంగ్, టాలెంటెడ్ హీరోలలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కూడా ఒకరు.
ప్రస్తుతం రామ్, దర్శకుడు మహేష్ బాబుతో కలిసి ఓ క్లీన్ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఎక్కువగా మాస్ సినిమాలనే చేసిన రామ్, ఇప్పుడు తనకు సరిపోయే క్లాస్ ట్రాక్‌లోకి మళ్లీ అడుగుపెట్టాడు.
ఈ సినిమా పై ఇప్పటికే మంచి బజ్ నెలకొనగా, ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ వార్త ఆయన లైనప్ గురించి వినిపిస్తోంది.
వివరాలు
చర్చల్లో ఓ మాస్ ప్రాజెక్ట్
ఇప్పుడీ రామ్ మరో యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం.
ఆ దర్శకుడు మరెవరో కాదు, తెలుగులో "హిట్" సినిమా యూనివర్స్‌ను పరిచయం చేసిన యువ దర్శకుడు శైలేష్ కొలను.
ప్రస్తుతం ఈ కాంబినేషన్‌లో ఓ మాస్ ప్రాజెక్ట్ చర్చల్లో ఉందని వార్తలు వస్తున్నాయి.
ఇక ఈ చిత్రాన్ని డైనమిక్ ప్రొడ్యూసర్ నాగవంశీ నిర్మించనున్నారని టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే, ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.