RAPO 22 : గీత రచయితగా మారిన రామ్.. కొత్త చిత్రంలో పాట రాసిన హీరో!
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా, ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న క్రేజీ ఎంటర్‌టైనర్ '#RAPO22' గురువారం పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభం కానుంది.
'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' ఫేమ్ మహేష్ బాబు. పి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి కలిసి నిర్మిస్తున్నారు.
రామ్ కెరీర్‌లో ఇది 22వ సినిమా. ఈ సినిమాలో రామ్ సరసన భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్‌గా నటిస్తోంది.
ఇస్మార్ట్ శంకర్ తర్వాత భారీ అంచనాల మధ్య రామ్ చేస్తున్న ఈ సినిమాతో తన హీరో స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
Details
రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్
రామ్ ఈ సినిమాలో సాగర్ పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో సినిమా షూటింగ్ జరగుతోంది. మేకర్స్ మార్చి 15 నుంచి కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.
ఈ సినిమాలో రామ్ రైటర్‌గా మారడం విశేషం. సినిమాకు సంబంధించి ఓ ప్రత్యేకమైన ప్రేమ గీతాన్ని స్వయంగా రామ్ రాశారని సమాచారం. పాట చాలా అద్భుతంగా వచ్చిందని టాక్.
గతంలో నటుడిగా, కొరియోగ్రాఫర్‌గా, ఫైట్స్ కంపోజిషన్‌లో తన ప్రతిభను నిరూపించుకున్న రామ్, ఇప్పుడు గీత రచయితగా కొత్త అవతారం ఎత్తడం ఆసక్తికరంగా మారింది.
ఈ సినిమాకు తమిళ మ్యూజిక్ కంపోజర్స్ వివేక్ - మెర్విన్ సంగీతాన్ని అందిస్తున్నారు. రామ్ రాసిన పాటను త్వరలోనే విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.