Loading...
Ramayana Box Office: రామాయణ దెబ్బకు బద్దలైన ఆర్‌ఆర్‌ఆర్‌, కేజీఎఫ్‌ 2 రికార్డులు
రామాయణ దెబ్బకు బద్దలైన ఆర్‌ఆర్‌ఆర్‌, కేజీఎఫ్‌ 2 రికార్డులు

Ramayana Box Office: రామాయణ దెబ్బకు బద్దలైన ఆర్‌ఆర్‌ఆర్‌, కేజీఎఫ్‌ 2 రికార్డులు

వ్రాసిన వారు Balachander Sharma
Nov 15, 2026
02:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

'రామాయణ' బాక్సాఫీస్‌ దూకుడు చూస్తుంటే ఇది కేవలం మరో భారీ సినిమా కాదు.. రికార్డులను ఒక్కొక్కటిగా తన ఖాతాలో వేసుకుంటున్న సినిమా అనిపిస్తోంది. నితీష్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం నవంబర్ 5న ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీపావళి సీజన్‌ను పూర్తిగా తనకు అనుకూలంగా మార్చుకున్న 'రామాయణ' కేవలం పది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.1,240 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. దీంతో భారతీయ సినిమా ఆల్‌టైమ్‌ అత్యధిక వసూళ్ల జాబితాలో టాప్‌ 6లోకి దూసుకెళ్లింది.

Details

ఓపెనింగ్ నుంచే వసూళ్ల సునామీ

సినిమా మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.155 కోట్ల భారీ వసూళ్లు రాబట్టింది. రెండో రోజు రూ.105 కోట్లు, మూడో రోజు రూ.145 కోట్లు, నాలుగో రోజు రూ.120 కోట్లు వచ్చాయి.

ఐదో రోజు మాత్రం ఏకంగా రూ.165 కోట్లతో అత్యధిక సింగిల్‌ డే కలెక్షన్‌ నమోదు చేసింది. ఆ తర్వాత ఆరో రోజు రూ.140 కోట్లు, ఏడో రోజు సుమారు రూ.100-110 కోట్లు, ఎనిమిదో రోజు రూ.85-90 కోట్లు, తొమ్మిదో రోజు రూ.80 కోట్లు రాబట్టింది.

పదో రోజు శనివారం మళ్లీ జోరు పెంచి రూ.120-130 కోట్ల మధ్య వసూలు చేయడంతో మొత్తం రూ.1,240 కోట్లకు చేరింది.

Details

ఆర్‌ఆర్‌ఆర్‌, కేజీఎఫ్‌ 2 రికార్డులకు చెక్

ఇక్కడే 'రామాయణ' అసలు సత్తా కనిపించింది. పది రోజుల కలెక్షన్లతోనే 'ఆర్‌ఆర్‌ఆర్‌' రూ.1,230 కోట్ల రికార్డును, 'కేజీఎఫ్‌ 2' రూ.1,215 కోట్ల వసూళ్లను దాటేసింది.

అంతేకాదు 'జవాన్‌' రూ.1,160 కోట్లు, 'పఠాన్‌' రూ.1,055 కోట్లు, 'కల్కి 2898 ఏడీ' రూ.1,042 కోట్ల లైఫ్‌టైమ్‌ కలెక్షన్లను కూడా వెనక్కి నెట్టింది.

దీంతో 'రామాయణ' భారతీయ సినిమా అత్యధిక వసూళ్ల జాబితాలో ఆరో స్థానాన్ని సొంతం చేసుకుంది.

ADVERTISEMENT

Details

నెక్ట్స్ టార్గెట్‌ 'ధురంధర్‌'

ఇప్పుడు 'రామాయణ' ముందు ఉన్న లక్ష్యం 'ధురంధర్‌'. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1,307.35 కోట్లతో ఐదో స్థానంలో కొనసాగుతోంది.

పది రోజుల్లోనే రూ.1,240 కోట్లకు చేరుకున్న 'రామాయణ'కు మరో రూ.67 కోట్లకు పైగా వస్తే ఆ రికార్డు కూడా దాటిపోయే అవకాశం ఉంది.

పదకొండో రోజు ఆదివారం కావడంతో థియేటర్లలో ఆక్యుపెన్సీ మరింత పెరిగే ఛాన్స్‌ ఉందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

అంటే టాప్‌ 5లోకి 'రామాయణ' ఎంట్రీ ఇక పెద్ద దూరంలో లేదన్నమాట.

ADVERTISEMENT

Details

ముందున్నది భారీ రికార్డుల రేసు

ప్రస్తుతం అత్యధిక వసూళ్ల జాబితాలో 'దంగల్‌' రూ.2,070.30 కోట్లు, 'ధురంధర్‌ 2' రూ.1,852.44 కోట్లు, 'బాహుబలి 2' రూ.1,788.06 కోట్లు, 'పుష్ప 2' రూ.1,742.10 కోట్లతో ముందున్నాయి.

'రామాయణ'కు వస్తున్న స్పందన ఇలాగే కొనసాగితే ఈ జాబితాలో మరిన్ని పేర్లు వెనక్కి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.

ముఖ్యంగా రెండో వారాంతంలోనూ కలెక్షన్లు బలంగా ఉండటం చిత్రబృందానికి మరింత ఊపునిస్తోంది.

ఇప్పటివరకు రికార్డులు బద్దలు కొట్టిన ఈ దృశ్యకావ్యం.. ఇక ఎంత దూరం వెళ్తుందనేది ఆసక్తికరంగా మారింది.

ADVERTISEMENT